బాలయ్య ఒప్పుకుంటే పండగే

0

ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన జోష్ ని ఎంజాయ్ చేస్తున్న పూరి జగన్నాధ్ ఇప్పుడు స్టార్ హీరోల పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడీ సక్సెస్ చూసి వాళ్ళే కాల్ చేస్తారనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది కానీ ఈలోగా ఫిలిం నగర్ లో జరుగుతున్న టాక్ లో మరోసారి బాలకృష్ణ పేరు వినిపిస్తోంది. పైసా వసూల్ టైంలో పూరితో మరో సినిమా చేస్తానని ప్రకటించిన బాలయ్య దాని ఫలితం చూశాక ఆ మాట మీద ఉండలేకపోయారు. ఆ తర్వాత ఆయనవి రెండు మూడు సినిమాలు ఫెయిల్ కావడం ఫైనల్ గా ఇప్పుడు తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ ని లాక్ చేసుకోవడం జరిగిపోయాయి.

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ చూశాక బాలయ్యకు కథ చెబితే పూరికి మళ్ళీ ఓకే చెప్తారన్న నమ్మకం దర్శకుడి టీమ్ లో ఉందట. అయితే పూరి దగ్గర అందుకు తగ్గ కథ సిద్ధంగా ఉందా లేదా అనేదే ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగినప్పుడు పూరి తన వద్ద వెంటనే స్టోరీ లేదని సిద్ధమైనప్పుడు కలిసి వినిపిస్తానని చెప్పాడు. ఒకవేళ బాలయ్య కనక పాజిటివ్ మూడ్ లో ఉంటే వేగంగా స్క్రిప్ట్ వండటం పూరికి పెద్ద పనేమీ కాదు.

కాకపోతే ఇది కార్యరూపం దాల్చడం అంత ఈజీ అయితే కాదు. ఈ విషయంగా ఛార్మీ మధ్యవర్తిత్వం చేసే ఛాన్స్ ఉందని వినికిడి. బాలయ్యతో గతంలో అల్లరి పిడుగులో హీరోయిన్ గా చేసిన ఛార్మీ పైసా వసూల్ ప్రాజెక్ట్ తెరకెక్కడంలో కీ రోల్ ప్లే చేసిందన్న మాట వినిపించింది. ఇదంతా నిజమే అయితే పైసా వసూల్ లో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా పూరి ఏదైనా కొత్తగా రాస్తాడేమో చూడాలి




Please Read Disclaimer