అలాంటి రాతలకు ఇళ్లలో ఏడ్చేస్తారు- పూరి

0

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై వచ్చినన్ని ఆరోపణలు మీడియాలో ఇంకెవరిపైనా రాలేదేమో! ముఖ్యంగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. అయితే ఇలాంటి వాటికి ఆయన బాధ పడరా? ఇదే ప్రశ్న ఆయననే అడిగితే ఆయన వేదాంత ధోరణి ఆశ్చర్యపరుస్తోంది. “మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీ స్నేహితులతో మీ రిలేషన్ షిప్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. మీ ఫ్యామిలీ .. వైఫ్.. పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు?“ అని ప్రశ్నిస్తే ఆయన సమాధానం ఎంతో ఎమోషనల్ అనే చెప్పాలి.

“ఇళ్లలో ఏడుస్తారు. మా వైఫ్ చాలాసార్లు ఏడ్వడం చూశాను. హీరోయిన్లు ఏడుస్తుంటారు.. వాళ్ల ఇళ్లలో. చాలా మందికి అలా జరిగింది. అయితే నాకు పరువు పోయిందని అస్సలు బాధపడను. వాటిని వదిలేస్తాం“ అని అన్నారు. మీపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్.. ఛార్మి గారితో ఎఫైర్ వార్తలు.. మీ వైఫ్ తో పోలీసాఫీసర్ వివాదం.. ఇవన్నీ మిమ్మల్ని బాధపెట్టాయా? వీటిపై సోషల్ మీడియా ప్రచారం చాలానే జరిగింది కదా? అని ప్రశ్నిస్తే..

“ఏం కావాలంటే అది చేసేయడమే. పని చేసుకోనివ్వరు వీళ్లెవరూ. వీళ్ల రాతల వల్ల మా ఆవిడ ఎన్నోసార్లు ఏడ్చింది.. ఇంట్లో.. అవతలి వాళ్ల ఇళ్లలోనూ ఇలాంటి సన్నివేశమే ఉంటుంది. ఎందరికో ఇలా అయ్యింది“ అని అన్నారు పూరి. ఛార్మితో ఎఫైర్ వార్తలను ప్రశ్నిస్తే.. “ఇబ్బందిగా ఉంటుంది. ఏది బడితే అది ప్రచారం.. నిజంగా వాళ్లు ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలీదు. ఇదే వీళ్ల పని.. వాళ్లు చేయాల్సిన పని చేయరు“ అంటూ ఆ రాతలపై తన అసహనాన్ని బయటపెట్టారు పూరి. సదరు ఇంటర్వ్యూలో పూరి ఇంకా చాలా ఆసక్తికర సంగతులే చెప్పారు.

మీ లైఫ్ డార్క్ ఫేజ్ ఏది? అని ప్రశ్నిస్తే… “అన్నీ పోగొట్టుకుని అన్నీ వదిలేసిన రోజు ఉంది. కుక్కల్ని కూడా పెంచలేని పరిస్థితిలో అద్దె ఇంట్లో బతికాను. ఫ్రెండ్స్ అంటే ఏంటో మనకు అలాంటప్పుడే క్లారిటీ వస్తుంది. ఖాళీ చేతులతో ఉన్నప్పుడే తప్పులేంటో తెలుస్తాయి. సాంతం చంక నాకిపోవడం తోనే అన్నీ తెలుస్తాయి“ అంటూ వేదాంత ధోరణితో స్పందించారు. ఒక చిన్న అద్దె గదిలో బతికానని పూరి వెళ్లడించారు. దాదాపు ఆరు ఫ్లాపుల తర్వాత పూరి ఇప్పటికి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తన పెళ్లి కి సంబంధించిన గమ్మత్తయిన విషయాన్ని పూరి రివీల్ చేశారు. తాను హేమ- యాంకర్ ఝాన్సీ వంటి వారి సహకారంతో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.

మా ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నిన్నే పెళ్లాడతా సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేస్తున్నా అప్పటికి. సినిమా చివరి షెడ్యూల్ నడుస్తోంది. అప్పటికే మా ఆవిడతో ప్రేమలో ఉన్నాను. అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఎర్రగడ్డలో ఓ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నాను. నా దగ్గర ఆ టైమ్ లో డబ్బుల్లేవు. యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చింది. హేమ బట్టలు కొంది. వేరొకరు ఎవరో కూల్ డ్రింక్స్ కొన్నారు. అక్కడే తాళి కట్టేసి.. అందరికీ కూల్ డ్రింక్స్ పంచేసి మళ్లీ 11 గంటలకు షూటింగ్ కు వెళ్లిపోయానని తెలిపారు.
Please Read Disclaimer