పూరి వైఫ్ లావణ్య ఎంట్రీ

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫ్యామిలీని ఎక్కువ పట్టించుకోడని.. సినిమా వారితో లేదా స్నేహితులతో ఎక్కువగా పార్టీలు పబ్బులు అంటూ తిరుగుతాడనే విమర్శలు ఉన్నాయి. వాటిపై ఎప్పుడు పెద్దగా స్పందించని పూరి జగన్నాద్ తాజాగా తన సోషల్ మీడియా పేజ్ ల ద్వారా ఆ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ప్రస్తుతం బ్యాంకాక్ లో భార్య మరియు పిల్లలతో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న పూరి జగన్నాధ్ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇదే సమయంలో పూరి భార్య లావణ్య సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. భర్త పూరితో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన లావణ్య మై లైఫ్ పూరి జగన్నాధ్ అంటూ తన భర్త పేరును ట్యాగ్ చేసింది. లావణ్య ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంటర్ అవ్వగానే ఆమెకు పలువురు శుభాకాంక్షలు చెబుతూ వెల్ కం చెప్పారు. అదే విధంగా పూరి కూడా తన ఇన్ స్టా లో భార్య లావణ్య ను ట్యాగ్ చేసి ఆమె అకౌంట్ ను అఫిషియల్ గా ప్రకటించాడు.

ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా.. వరుసగా హిట్స్ పడ్డా కూడా పూరి మాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటాడు. ఆయన ప్రవర్తనలో మార్పు కనిపించదు. చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పూరి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత హాలీడేస్ కోసం బ్యాంకాక్ వెళ్లిన పూరి త్వరలో విజయ్ దేవరకొండ మూవీ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు. మరో వైపు పూరి ప్రొడక్షన్ వర్క్ ను కూడా చూసుకుంటున్నాడు. ఇక తన కొడుకు ఆకాష్ రెండవ సినిమాకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంత బిజీ సమయంలో కుటుంబంతో బ్యాంకాక్ హాలీడే ట్రిప్ వెళ్లిన పూరి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home