రౌడీ హీరోతో తలపడనున్న సూపర్ స్టార్ విలన్!!

0

Puri-jagannadh-consulted-Sunil-Sheety-for-vijay-movieడాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ – మాస్ హీరో కలిస్తే అభిమానులలో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా పై కూడా అంచనాలు అదే రేంజ్ లో నెలకొన్నాయి. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ నామమాత్రంగా పాపులర్ అవుతోంది. పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్.

ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఇండస్ట్రీకి అనన్య టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయం అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. పూరీ సినిమాలలో విలన్స్ అంటే డిఫరెంట్ స్టైల్.. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటారు. అలాగే హీరోకి ధీటుగా కూడా ఉంటారు. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ కోసం స్ట్రాంగ్ విలన్ ని సెర్చ్ చేస్తున్నాడట. అయితే ఇటీవలే ఓ స్టార్ యాక్టర్ తో సంప్రదింపులు జరిపారట. ఆయనే బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి. సునీల్ ఈ ఏడాది దర్బార్ సినిమాలో రజినీకి విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే.

విజయ్ పోటీగా సూట్ అవుతాడని పూరీ భావించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు దేశంలోని అన్నీ భాషలకు సరిపోయేలా టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముంబైలో షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇటీవలే హైదరాబాద్ లో సెట్ వేసి ఇక్కడే సినిమా ఫినిష్ చేసే ప్లాన్ ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది. మరి విజయ్ – సునీల్ శెట్టి ఏ రేంజిలో తలపడనున్నారో.. అనే అంశం ఆసక్తి కలిగిస్తుంది. త్వరలో షూటింగ్ ప్రారంభించడానికి పూరీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నారట. తెలుగు హిందీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న ఈ సినిమాను పూరిజగన్నాథ్ మంచి కమర్షియల్ హంగులతో పూరీ మార్క్ ఐ ఫీస్ట్ ఉండబోతుందని అంటున్నారు.