జగన్‌ మామూలోడు కాదు స్వామీ!

0

పూరి జగన్నాథ్‌ ఈమధ్య కాలంలో తీసిన సినిమాలు చూస్తే అతని కొత్త సినిమా గురించి ఎవరూ పట్టించుకోను కూడా పట్టించుకోకూడదు. రాంగోపాల్‌వర్మని ఎలాగయితే ఇగ్నోర్‌ చేస్తున్నారో పూరీని కూడా ఈపాటికి రిస్ట్రిక్టెడ్‌ జోన్‌లో పెట్టేసి వుండాలి. కానీ తన సినిమావైపు జనం చూసేలా, దాని గురించి మాట్లాడుకునేలా, అది ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఎదురు చూసేలా చేయడంలో పూరీ దిట్ట. ఎన్ని ఫ్లాప్‌లు ఇచ్చినా కానీ పూరీ ఎప్పుడో అప్పుడు ఇలాంటి ట్రిక్‌ పుల్‌ చేస్తుంటాడు. అతని తాజా చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనౌన్స్‌ అయిన నాటినుంచీ ఏదో విధంగా ఆకర్షిస్తూనే వుంది.

ఈ చిత్రం ట్రెయిలర్స్‌కి, పాటలకీ ‘లౌడ్‌’ అనే ముద్ర పడింది. అయినా కానీ ఈ చిత్రం చూడాలనే వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే వచ్చింది. యూట్యూబ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఏ వీడియో పెట్టినా ఇన్‌స్టంట్‌ హిట్‌ అయింది. ఈ హైప్‌ అంతా ఉత్తుత్తిది కాదని ఇప్పుడీ చిత్రానికి జరుగుతోన్న అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తేనే తెలుస్తోంది. మహర్షి తర్వాత వచ్చిన తెలుగు సినిమాలలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పరంగా దేనికీ కనిపించని క్రేజ్‌ ఇస్మార్ట్‌కి వుంది. ఈ సంకేతాలని బట్టి తొలి రోజున ఇస్మార్ట్‌ శంకర్‌ వసూళ్లు అదిరిపోతాయి. విమర్శకులని మెప్పించినా లేకున్నా సగటు సినీ ప్రియులని సంతృప్తికరంగా బయటకి పంపితే పూరి జగన్నాథ్‌ టైమ్‌ మళ్లీ స్టార్ట్‌ అయిపోతుంది.
Please Read Disclaimer