పూరీకి మహేష్ మీద ఇంకా కోపం తగ్గినట్లు లేదుగా..!

0

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గత కొన్ని రోజులుగా టిక్ టాక్ వీడియోలతో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పోకిరి’ సినిమాలోని ఒక డైలాగ్ కి టిక్ టాక్ చేసాడు వార్నర్. మహేష్ బాబు చెప్పిన ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ టిక్ టాక్ వీడియో చేసాడు వార్నర్. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దాకా వెళ్ళింది. దీంతో వార్నర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేసాడు పూరీ. అంతేకాకుండా దానికి ప్రతిగా కృతజ్ఞతలు తెలుపుతూ వార్నర్ కూడా ట్వీట్ చేసాడు. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ పూరీ వేసిన ట్వీట్ పై సూపర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పూరీ వార్నర్ ని పొగిడితే మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవడం ఏంటని ఆలోచిస్తున్నారా..!

కథ ఏమిటంటే.. గత కొంతకాలంగా మహేష్ బాబు – పూరీ జగన్నాథ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని మనం తరచూ వార్తలు వింటూనే వస్తున్నాం. మహేష్ – పూరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని మాట్లాడుకోవడమే గానీ కచ్చితంగా ఇది అని ఎవ్వరూ చెప్పలేదు. అయితే ఇప్పుడు తాజాగా పూరీ చేసిన ట్వీట్ చూస్తే ఇప్పుడు మరోసారి ఇది నిజం అనే డౌట్ రాకమానదు. ఈ రోజు పూరీ ‘పోకిరి’ డైలాగ్ కి టిక్ టాక్ చేసిన డేవిడ్ వార్నర్ ని ప్రశంసిస్తూ ”డేవిడ్ అంటే దూకుడు మరియు మొండి పట్టుదల. ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ మీకు బాగా సూట్ అయింది. మీరు యాక్టర్ గా కూడా అద్భుతంగా నటించారు. మీరు నా చిత్రంలో అతిధి పాత్ర చేస్తారని ఆశిస్తున్నాను. లవ్ యూ” అంటూ ట్వీట్ చేసాడు. ఇప్పుడు అదే మహేష్ అభిమానులకు కోపాన్ని తెప్పించింది. ఇంతటి అద్భుతమైన డైలాగ్ పలికిన హీరోని ట్వీట్ లో మెన్షన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ పూరీపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు. యాంటీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం కరెక్ట్ గా చెప్పారు సార్.. ఈ డైలాగ్ మహేష్ కంటే వార్నర్ కే బాగా సూట్ అయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాస్తవానికి మహేష్ బాబుని పూరీ లైట్ తీసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ మధ్య ‘పోకిరి’ 14 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఇలాంటి సీనే రిపీట్ అయింది. అప్పుడు కూడా మహేష్ ని పట్టించుకోలేదు పూరీ. ప్రతి చిన్న దానికి ట్వీట్ చేస్తూ వారిని ట్యాగ్ చేసే పూరీ మహేష్ ని మాత్రం లైట్ తీసుకుంటున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఇది ఈ మధ్య స్టార్ట్ అయింది కాదు. ‘పోకిరి’ ‘బిజినెస్ మెన్’ చిత్రాల తరువాత హ్యాట్రిక్ సినిమాగా ‘జనగణమన’ అనే సినిమాని ప్రకటించాడు పూరి. కానీ ఈ ప్రాజెక్ట్ కార్యరూపం మాత్రం దాల్చడం లేదు. ఒక ఇంటర్వ్యూలో మహేష్ ని ఉద్దేశించి ‘స్టోరీ నచ్చితే వెంటనే ఓకే చెప్పాలి.. లేదా నచ్చలేదని చెప్పాలి.. అంతేకానీ వారిని వెయిట్ చేపించకూడదు’ అంటూ ఇండైరెక్ట్ గా మహేష్ పై కామెంట్ చేసాడు పూరీ. ఆ తర్వాత హిట్టుల్లో ఉంటేనే మహేష్ అవకాశం ఇస్తాడని.. మహేష్ అభిమానులకు తనపై నమ్మకం ఉన్నప్పటికీ… మహేష్ కి లేదనీ పూరి చెప్పాడు. దీనికి తోడు మహేష్ ‘మహర్షి’ వేడుకల్లో సుకుమార్ – పూరీలను విస్మరించాడు. వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుండటంతో కావాలనే ఇద్దరి పేర్లు చెప్పలేదేమోనని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ సోషల్ మీడియాలో ‘కిక్కిరిసిన జనం ఉండటం వల్ల వేదికపై చెప్పడం మరిచిపోయాయని’ చెప్పి ఆ ఇద్దరికి థాంక్స్ చెప్పాడు మహేష్.

ఇప్పుడు తాజా ఘటనతో పూరీకి ఇంకా మహేష్ మీద కోపం తగ్గలేదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మహేష్ ఫ్యాన్స్ మాత్రం పూరీ – మహేష్ కాంబినేషన్ లో ఒక మాస్ మూవీ రావాలని కోరుకుంటున్నారు. పూరీ పవర్ ఫుల్ డైలాగ్స్ మహేష్ నోట వినాలని ఎప్పటి నుండో ఆశ పడుతున్నారు. ఇప్పటికి మీ కాంబోలో ‘జనగణమన’ ఎప్పుడు అని ట్విట్టర్ లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. వీరి మధ్య దూరం తొలగిపోయి వీరి కాంబోలో మంచి మాస్ మసాలా మూవీ పడితే ఇండస్ట్రీ హిట్ గ్యారంటీ అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరి కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కుతుందేమో చూడాలి.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home