నన్ను ఇబ్బంది పెట్టిన వారి గురించి త్వరలో చెప్తా!

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో ఒక సాలిడ్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. విడుదలైన మొదటి వారం రోజుల్లోనే 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా 70 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మరింతగా వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు పూరి చాలా జోష్ గా ఉన్నాడు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. దర్శకుడిగా ఎలాంటి ఇబ్బంది లేదు కాని సినిమాను నిర్మించినప్పుడు మాత్రం నన్ను చాలా సంఘటనలు బాధ పెట్టాయి. ఎంతో మంది నన్ను టార్గెట్ చేసి రాళ్లు విసిరారు. ఇది నా ఒక్కడికి మాత్రమే కాదు నిర్మాతలందరికి ఇలాంటివి కామన్. కొందరు ఎన్నో రకాలుగా నిర్మాతలతో ఆడుకుంటూ ఉంటారు. వ్యక్తిగతంగా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకున్నా నిర్మాతగా నన్ను చాలా ఆడుకున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్నా కొద్ది కొందరి టార్చర్ మరీ ఎక్కువ అయ్యింది.

సినిమా విడుదల అయ్యే సమయంలో అది ఆడుతుందా లేదా అనే టెన్షన్ తో పాటు వారు పెట్టే ఇబ్బందులతో నిర్మాతలు నరకం చూస్తారు. సినిమా సక్సెస్ అయితే కాస్త ఉపశమనం లభిస్తుంది. కాని సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మరో రకం ఇబ్బంది ఎదురవుతుంది. ఇలా ప్రతి సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా నిర్మాతలు మాత్రం సినిమాలను నిర్మించకుండా ఉండరు. నన్ను ఇబ్బంది పెట్టిన వారి వివరాలను త్వరలో వెళ్లడిస్తాను. దాని కొసం ఒక పోగ్రామ్ పెట్టి మరీ బ్లాస్ చేయబోతున్నట్లుగా పూరి ప్రకటించాడు. పూరి పెట్టబోతున్న ఆ పోగ్రాం ఏంటీ.. ఎప్పుడు అది ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer