ఫెయిల్యూర్ లో ఉంటే పెగ్గు పోస్తాడు!

0

స్నేహానికి నిర్వచనం చెప్పమని అడిగితే ఒక్కొక్కరూ ఒక్కోలా చెబుతారు. ముఖ్యంగా పరిశ్రమలో స్నేహాలు ఎంతో విచిత్రమైనవి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కలుస్తారు. తర్వాత విడిపోలేనంత గొప్ప స్నేహితులు అవుతారు. అయితే అలా వచ్చిన వాళ్లలో రియల్ ఫ్రెండు ఎవరు? అన్నది ఎప్పుడు తేల్తుంది? అంటే.. మనం కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చేవాడు ఫ్రెండు. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడు నిజమైన ఫ్రెండు. ఫ్లాపుల్లో ఉంటే దూరం పెట్టేవాడు ఫ్రెండు కాలేడు.

ఇదే విషయాన్ని స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాస్తంత అటూ ఇటూగా చెప్పారు. అలీతో పూరి స్నేహం గురించి తెలిసిందే. తన సినిమాలో అలీకి ఒక ట్రాక్ ఉండాల్సిందే. అయితే అలీతో అనుబంధం ఇప్పటిది కాదు. పూరి దర్శకుడు కాకముందే అలీకి అభిమాని. అలీ నటించిన సీతాకోక చిలుక చూశాక అభిమాని అయిపోయాడు. అతడు ఓ పార్టీ కోసం పూరి స్వస్థలానికి దగ్గరగా ఉండే `తుని`కి అలీ వస్తున్నాడని తెలిసి అక్కడికి వెళ్లారు. అప్పుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. పూరి తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ అలీకి ఓ ట్రాక్ ఉండాల్సిందే. ఇటీవల ఒకట్రెండు మిస్సయినా తిరిగి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందట. ఇక అలీతో తన సాన్నిహిత్యాన్ని పూరి వర్ణించిన తీరు అద్భుతం.

“ఫెయిల్యూర్ వచ్చి నేనెప్పుడైనా బాధల్లో ఉంటే అలీనే వస్తాడు. ఒక పెగ్గు పోస్తాడు. తర్వాత భుజం తట్టి వెళ్లిపోతాడు. అదే నాకు హిట్ వస్తే.. ఒక బొకే పట్టుకుని వస్తాడు. హగ్ చేసుకుని వెళ్లిపోతాడు. నాకు కష్టం వచ్చినా.. సుఖం వచ్చినా చెప్పకుండా వచ్చి కలిసే ఏకైక వ్యక్తి అలీనే“ అంటూ పూరి ఎమోషన్ అయిపోయాడు. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని చివరికి ఆఫీస్ కూడా అమ్ముకుని వెళ్లిపోవాల్సిన పరిస్థితిలో అలీ వచ్చి ఒక దేవుడి ఫోటో ఇచ్చాడు. అన్ని కష్టాలు తొలిగిపోతాయని అన్నాడు. అలానే జరిగింది… అని పూరి ఎమోషన్ అయ్యారు. అలీ నటించిన పండుగాడి ఫోటో స్టూడియో త్వరలో రిలీజవుతోంది. ఈ సినిమా ఆడియో వేడుకలో పూరి పైవిధంగా స్పందించారు. `ఇస్మార్ట్ శంకర్`లో అలీని ఎందుకు తీసుకోలేని చాలా మంది అడుగుతున్నారు. తర్వాతి సినిమాలో చేస్తామని అన్నారు పూరి.
Please Read Disclaimer