దేవుడి తప్పుని ఒప్పుకున్న పూరి!

0

చాలా కాలంగా అందని ద్రాక్షగా మిగిలిపోయిన సక్సెస్ ని ఇస్మార్ట్ శంకర్ రూపంలో అందుకున్న పూరి జగన్నాధ్ ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు. మొహం చాటేసిన వారు సైతం ప్రత్యేకంగా అభినందించడంతో సంతోషం మాములుగా లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ తీసిన పూరికి ఇలాంటి సిచువేషన్ రావడంలో వింతేమీ లేదు. ఇది అందరూ అనుభవించే దశే. కాకపోతే తమ స్థాయికి తగ్గ సినిమాలు తీయనప్పుడు వాటి ప్రస్తావన తరచు వస్తూనే ఉంటుంది.

ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూరి గతంలో రవితేజతో తీసిన దేవుడు చేసిన మనుషులు గురించి వివరణ ఇచ్చుకున్నాడు. అది స్క్రిప్ట్ లోనే జరిగిన తప్పిదమని అలా తీయకుండా ఉండాల్సింది కాదని ఒప్పుకున్నాడు. పూరి తీసిన మోస్ట్ బ్యాడ్ మూవీస్ లో దీనిదే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ అభిమానులు ఇలాంటి సినిమా మా పూరి ఎందుకు తీశాడా అని చెప్పుకుంటూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా వివరణ ఇచ్చాడు పూరి.

ఒక సక్సెస్ వచ్చినప్పుడు అందరూ తనను చుట్టుముట్టేసి కొత్త సినిమా కోసం కథ కోసం ఒత్తిడి చేస్తారని ఆ హడావిడిలో ఏదో ఇలాంటి అర్థం లేని ప్రయోగాలు చేయాల్సి వచ్చిందని మంచి కథ రాసుకునేందుకు కూడా గ్యాప్ ఇవ్వకపోతే ఇలాగే జరుగుతుందని చెప్పాడు. సరే దీనికేనా రోగ్-లోఫర్-పైసా వసూల్ లాంటి వాటి విషయంలోనూ ఇదే జరిగిందా అంటే ఏమో అదే రిపీట్ అయిందేమో కాబోలు. ఇప్పటికే 60 కోట్ల గ్రాస్ దాటిన ఇస్మార్ట్ శంకర్ ఇప్పటిదాకా ఈ ఏడాదిలో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ రిపోర్ట్.
Please Read Disclaimer