సక్సెస్ ఫార్ములా..మళ్లీ రిపీట్ ?

0

‘టెంపర్’ తర్వాత వరుస ఫ్లాపులతో కెరీర్ ని కొనసాగించిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్ శంకర్’ తో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో ఐయాం బ్యాక్ అనిపించుకున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు మళ్లీ అదే సక్సెస్ ఫార్ములాని ఫాలో అవ్వబోతున్నాడని తెలుస్తుంది.

ఈరోజు తన నెక్స్ట్ సినిమాను విజయ్ దేవరకొండతో చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు పూరి. అయితే విజయ్ తో ‘జనగణమన’ సినిమా చేస్తాడని అందరూ ఊహిస్తున్నారు. అయితే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా మళ్లీ ఈ ఇస్మార్ట్ శంకర్ లాగ ఓ ఓల్డ్ కుర్రాడి కథతో పక్కా మాస్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. విజయ్ ఎలాగో తెలంగాణ భాషతో హై ఎనర్జీతో చితకొట్టేస్తాడు. అందుకే ఈ కథకి విజయ్ ని ఏరికోరి మరీ ఎంచుకున్నాడట పూరి.

ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పూరి విజయ్ కోసం కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నాడు. హీరోయిన్ కోసమే ఇటీవలే ముంబై వెళ్లొచ్చాడట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డిటైల్స్ తెలియజేయనున్నారు. సంగీత భాద్యతలు మాత్రం మళ్లీ మణి శర్మ చేతిలోనే పెట్టనున్నాడని సమాచారం. ఏదేమైనా ఈ కాంబో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తక్కువ సినిమాలతోనే స్టార్డం అందుకున్న విజయ్ ని మరి పూరి ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. కొన్ని రోజుల్లో తెలియనుంది.
Please Read Disclaimer