పూరి తమ్ముడికి ఎందుకంత కాన్ఫిడెన్స్?

0

టాలీవుడ్ లో కొందరు హీరోలు హిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అందులో పూరి తమ్ముడు సాయి రాం ఒకడు. పూరి డైరెక్ట్ చేసిన ‘143’ సినిమాతో హీరోగా పరిచయమైన సాయి మొదటి సినిమాతోనే ఫ్లాప్ అందుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ‘బంపర్ ఆఫర్’ మినహా సాయి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుసగా ఫ్లాప్ అయ్యాయి.

తాజాగా సాయి హీరో మరో సినిమా స్టార్ట్ చేసాడు. ‘రీ సౌండ్’ అనే టైటిల్ తో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ – సురేందర్ రెడ్డి ల చేతుల మీదుగా సినిమాను స్టార్ట్ చేసి పూజా కార్యక్రమాలు చేసారు. ఈ రోజే షూటింగ్ ప్రారంభం అయింది కూడా. అయితే ఓపెనింగ్ రోజే ఇది మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కే సినిమా అంటూ షూటింగ్ పూర్తవ్వగానే ముందు మీడియాకి చూపించి అందరి ప్రశంసలు అందుకుంటానే ధీమా వ్యక్తం చేసాడు సాయి.

ఈ రోజుల్లో మార్కెట్ ఉన్న హీరోల పరిస్థితే అంతంత మాత్రంగా ఉంది. కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ కూడా కష్టం అవుతుంది. నిర్మాతలు విపరీతంగా నష్టపోతున్నారు కూడా. మరి ఈ కాన్సెప్ట్ సినిమాతో పూరి తమ్ముడు హిట్ కొట్టి హీరోగా నిలబడతడా డౌటే?
Please Read Disclaimer