గోవాలో ఇస్మార్ట్ టీం చిల్ మూమెంట్

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో చాలా రోజుల తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ కేవలం పూరికి మాత్రమే కాకుండా చాలా మందికి బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రామ్ కు కెరీర్ లో కీలక విజయాన్ని కట్టబెట్టింది. ఇక హీరోయిన్స్ కు కూడా ఇస్మార్ట్ సక్సెస్ తో మంచి ఫేమ్ వచ్చింది. ముఖ్యంగా నిధి అగర్వాల్ అంతకు ముందు చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. కాని ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో నిధి కెరీర్ టర్న్ తిరిగినట్లయ్యింది.

ప్రస్తుతం పూరి నిర్మాణంలో ‘రొమాంటిక్’ సినిమా తెరకెక్కుతుంది. గోవాలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆకాష్ పూరి హీరోగా అనీల్ పాదూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. రొమాంటిక్ సినిమా చిత్రీకరణ పర్యవేక్షించేందుకు నిర్మాత పూరి మరియు సహ నిర్మాత అయిన ఛార్మి గోవాలో ఉన్నారు. ఇదే సమయంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా అక్కడకు వెళ్లింది.

పూరి మరియు ఛార్మిని కలిసిన నిధి అగర్వాల్ రోజులో సగంను నాకు ఇష్టమైన పూరి మరియు ఛార్మిలతో గోవాలో గడిపినట్లుగా సోషల్ మీడియాలో ఫొటోతో సహా పోస్ట్ చేసింది. గోవాకు ఇస్మార్ట్ నిధి ఎందుకు వెళ్లింది అనేది క్లారిటీ లేదు. రొమాంటిక్ లో ఏమైనా చిన్న పాత్ర పోషిస్తుందా లేదంటే మరేదైనా సినిమా కోసం ఈ అమ్మడు గోవా వెళ్లిందో తెలియదు. కాని అక్కడ తన ఇస్మార్ట్ టీం ను కలిసి ఎంజాయ్ చేసినట్లుగా మాత్రం చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer