బాలకృష్ణ-పూరి కాంబో ఫిక్సయినట్టేనా?

0

`ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ తో పూరి తిరిగి ట్రాక్ లో పడిన సంగతి తెలిసిందే. ఒకే ఒక్క హిట్టు అతడి లో నూతనోత్సాహం నింపింది. ఇన్నాళ్లు తనని ఫ్లాప్ డైరెక్టర్ అని దూరం పెట్టిన వాళ్లే.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ దర్శకుడిగా గౌరవం ఇస్తున్నారు. ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కిక్కులో పూరి వరుసగా సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే విజయ్ దేవరకొండతో సినిమాని అధికారికంగా ప్రకటించారు పూరి-ఛార్మి బృందం.

ఈలోగానే నటసింహా నందమూరి బాలకృష్ణతోనూ సంప్రదింపులు సాగిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య బాబు నుంచి ఆసక్తి వ్యక్తమైందట. `పైసా వసూల్` సమయంలోనే పూరితో మరో సినిమా చేస్తానని బాలకృష్ణ మాటిచ్చారు. అయితే పూరి ఫ్లాప్ ల రికార్డు వల్ల అప్పట్లో వద్దనుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టగానే తిరిగి పాజిటివ్ సంకేతాలు వెలువడ్డాయని తెలుస్తోంది.

ఈసారి కూడా పూరి యథావిధిగానే ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రాన్ని ఎన్బీకే పిక్చర్స్ (బాలకృష్ణ) – పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించే వీలుందని తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమాని 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. ఈలోగానే పూరితో సినిమాని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home