ఆ దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా కన్ఫర్మ్!

0

‘మజిలీ’ రిలీజ్ తర్వాత శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో సినిమా చేయనున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. అయితే ఈ వార్తపై విజయ్ కానీ దర్శకుడు శివ కానీ రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఈ కాంబినేషన్ సినిమా ఉంటుందా లేదా అనే కన్ఫ్యూజన్ రౌడీ ఫ్యాన్స్ లో మొదలైంది.

అయితే తాజాగా మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఈ కాంబినేషన్ సినిమాను కన్ఫర్మ్ చేసాడు విజయ్ దేవరకొండ. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాను సెట్స్ పై పెట్టనున్నట్లు తెలిపిన విజయ్ ఆ సినిమా తర్వాత ‘హీరో’ సినిమాను పూర్తి చేస్తానంటూ చెప్పాడు. ఇక శివ నిర్వాణతో మరో సినిమా ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేసాడు.

సో విజయ్ చెప్పిన ఈ మాటతో ఈ కాంబినేషన్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. ‘నిన్ను కోరి’ -‘మజిలీ’ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న శివ కి విజయ్ కోసం కథ రాయడానికి ఇంకా టైం పడుతుంది. సో ఈ లోపు ‘ఫైటర్’ – ‘హీరో’ సినిమాలను కంప్లీట్ చేసి శివ సినిమాకి డేట్స్ ఇచ్చేస్తాడు రౌడీ.
Please Read Disclaimer