ఫైటర్.. నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్

0

యువహీరో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాను పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ఫైటర్’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. పూరి జగన్నాధ్ స్పీడ్ ఎలా ఉంటుందనేది అందరికీ తెలుసు. అయినా ఈ సినిమాకు చాలారోజుల నుండి ప్రీ ప్రొడక్షన్ ఎందుకు చేస్తున్నారనేది చాలామందికి అర్థం కాలేదు. దీనికో కారణం ఉందట.

ఈ సినిమాను రెగ్యులర్ గా పూరి సినిమాలు తీసిన స్టైల్లో తెరకెక్కించడంలేదట. ఈ సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఎక్కువ సమయం తీసుకుని మరీ యూనివర్సల్ అప్పీల్ ఉండేలా పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నారట. ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ రెడీ అయిందని.. పూరి టీమ్ స్క్రిప్ట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారని సమాచారం. ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్లాన్ చేసుకోవడంతో ఇప్పటి నుంచి నిర్మాతలైన పూరి -ఛార్మి ఇతర భాషల నిర్మాతలతో టై అప్ కోసం ప్రయత్నాలు చేశారట. ఆల్రెడీ కొందరు ఇతర భాషల మేకర్లు ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారని అంటున్నారు.

‘అర్జున్ రెడ్డి’ తో దేశ వ్యాప్తంగా యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. దీంతో ఈ సినిమాకు మంచి హైప్ నెలకొనడం ఖాయమే. మొదటి నుంచే ప్యాన్ ఇండియా ఫిలిం గా ప్రాజెక్ట్ చేస్తే వ్యాపారపరంగా కూడా ‘ఫైటర్’ కు కలిసివచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు కంటెంట్ ఉంటే చాలు ఏ భాష అని కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కంటెంట్ తో వస్తే విజయం సాధించడం అసాధ్యమేమీ కాదు.
Please Read Disclaimer