చిరు – ప్రభాస్ – చరణ్ ఇంకా చాలా మంది కాల్ చేశారట!

0

మూడేళ్ల తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఈ చిత్రం విడుదలైన ఎనిమిది రోజుల్లో ఏకంగా 63 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. వారం పూర్తి అయిన తర్వాత కూడా ఇంకా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ జోరు చూస్తుంటే దాదాపుగా 80 కోట్ల గ్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రం సక్సెస్ సందర్బంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్ సభ్యులు ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్బంగా దర్శకుడు పూరి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో అనే భయంతో నాకు ఉచ్చ పడింది. ఏ సినిమా తీసినా కూడా సక్సెస్ అవుతుందనే తీస్తాం. ముందే ఫ్లాప్ అవుతుందనుకుంటే ఎందుకు తీస్తాం అన్నీ హిట్స్ తీసేవాడిని. నాకు సరైన సక్సెస్ పడి మూడు సంవత్సరాలు అయ్యింది. దాంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకున్నాను. జీవితంలో మొదటి సారి హిట్ కావాలని గట్టిగా కోరుకున్నాను. ఫైనల్ గా సక్సెస్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడకు వెళ్లినా సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ఏపీలో ఏమాడుతుందో అన్నారు. కాని ఇటీవల ఏపీలో పర్యటించినప్పుడు అక్కడి వారు సినిమా మస్త్ తీసినవన్నా.. కిరాక్ గా ఉంది సినిమా అంటూ చెబుతున్న సమయంలో ఆనందంగా అనిపించింది.

సినిమా విడుదలైన తర్వాత మొదటగా ప్రభాస్ కాల్ చేశాడు. సినిమా ఇంకా చూడలేదు.. బాగా ఆడుతుందట కదా హ్యాపీగా ఉందన్నాడు. నాగచైతన్య.. అఖిల్.. రానా.. చరణ్ ల నుండి కూడా కాల్ వచ్చింది. చిరంజీవి గారు సినిమా చూసి అభినందించారు. బాలకృష్ణ గారు సినిమా చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఇంత మంది హీరోలు కాల్ చేయడం జరగలేదు. అందరి నుండి కాల్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇక ముందు కూడా ఇలాంటి మాస్ సినిమాలు వస్తాయంటూ ఈ సందర్బంగా పూరి చెప్పుకొచ్చాడు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home