రౌడీ కి చియాన్ గెటప్ సెట్ చేశారా?

0

రౌడీ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఫైటర్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ సహా బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ని పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ చేసేందుకు పూరి-చార్మి బృందం అటు కరణ్ జోహార్ తో మంతనాలు సాగించి అనంతరం డీల్ కుదుర్చుకోవడం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ కోసం పూరి అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడు. అతడికి అన్నివిధాలా సాయం అయ్యేలా రౌడీ ఇప్పటికే బాలీవుడ్ సర్కిల్స్ లోనూ పాపులారిటీని పెంచుకుంటున్నాడు. పూరి-చార్మి-కరణ్ బృందం ఈ పాన్ ఇండియా చిత్రానికి పెట్టుబడులు సమకూర్చనుంది.

ఆ క్రమం లోనే గత నెలరోజులుగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫోటోషూట్లు అంతర్జాలాన్ని వేడెక్కించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత ముంబై హెయిర్ డిజైనర్ ఆలిమ్ హకీమ్ రౌడీ లుక్ ని పూర్తిగా మార్చేయడం పైనా ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది. అప్పట్లో రివీలైన ఫోటోషూట్ నుంచే ఓ లుక్ ని రౌడీ ఫైటర్ కోసం ఫైనల్ చేశారట. ఆ మేరకు ఫైటర్ లుక్ ని ఫైనల్ చేసిన విషయాన్ని ఛార్మి అధికారికంగానే సోషల్ మీడియాల్లో వెల్లడించారు. దేవరకొండ లుక్ ఫైనల్ అయ్యింది. స్టైలింగ్ పై ఆలిమ్ హకీమ్- పూరి బృందం కసరత్తు చేశారు. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ కొన్ని ఫోటోల్ని తీసేందుకు వెనకాడ లేదు.. అంటూ వివరాల్ని అందించారు. ఫైటర్ న్యూ లుక్ కిల్లర్ రేంజు లో వర్కవుటైంది అంటూ ఛార్మి ఆనందం వ్యక్తం చేయడం ఆసక్తి ని రేకెత్తిస్తోంది.

ఇక ప్రఖ్యాత హెయిర్ డిజైనర్ కం లుక్ డిజైనర్ ఆకిం హలీమ్ ఇప్పటికే ఎందరో టాలీవుడ్ స్టార్ల లుక్ ని గతంలో డిజైన్ చేశారు. ప్రభాస్ సాహో లుక్ ని.. ఆర్.ఆర్.ఆర్ చరణ్ లుక్ ని డిజైన్ చేసింది ఆయనే. ఇప్పుడు రౌడీకి ఫైటర్ గా ఓ కొత్త లుక్ ని డిజైన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ లుక్ ఎంతో స్పెషల్ గా ఉంది. రౌడీలోని రెమోని.. ఫైటర్ ని వెలికి తీసేలా ఉంది! అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోషూట్లో ఇతర ఫోటోల్లోనూ విజయ్ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించాడు. ఆ హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసిన తీరు.. ఆ లుక్ లో ఎనర్జీ మైండ్ బ్లోయింగ్ అన్న ప్రశంసలు దక్కుతున్నాయి. కాస్త చియాన్ లా.. రెమోలా కనిపిస్తున్నా లుక్ అతడికి పర్ఫెక్ట్ గా సూటైంది. సంక్రాంతి తర్వాత ఫైటర్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు పూరి బృందం సన్నాహకాల్లో ఉంది.
Please Read Disclaimer