తలైవికి క్వీన్ ఝలక్

0

కంగన.. నిత్యామీనన్.. రమ్యకృష్ణ.. ఈ ముగ్గురిని అమ్మ జయలలిత పాత్రలో చూడబోతున్నాం. ఇప్పటికే నిత్యా ‘ది ఐరన్ లేడీ’ ఫస్ట్ లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. అమ్మ పాత్రకు నిత్యా పర్ఫెక్ట్ గా సూటబుల్ అని ప్రశంసించారు. ఇటీవలే తలైవిగా కంగన లుక్ కూడా వచ్చింది. మోషన్ పోస్టర్ కం టీజర్ చూడగానే అభిమానుల్లో రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇందులో కంగన వేషాలపైనా విమర్శలు వచ్చాయి. ఇక ప్రోస్థటిక్ మేకప్ పై ఊహించని కామెంట్లతో విరుచుకుపడ్డారు అమ్మ అభిమానులు. కంగన బొమ్మలా ఉందని వెకిలిగా కనిపించిందని తిట్టారు కొందరైతే.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తో గౌతమ్ మీనన్ బృందం బరిలో దిగడం వేడెక్కిస్తోంది. ఇందులో జయలలిత పాత్రలో రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటిస్తుండడంతో అంచనాలు స్కైలో ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో అమ్మ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది? అని ఎదురు చూసిన వారికి ఏమాత్రం నిరాశకలిగించని ట్రీట్ గౌతమ్ మీనన్ ఇవ్వబోతున్నారు. తాజాగా రమ్యకృష్ణ లుక్ రిలీజైంది. ఈ లుక్ ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

భారీ బడ్జెట్లతో సాహసం చేస్తున్న నిర్మాతల్లో సందేహం రాజుకునేంతగా ఈ లుక్ వర్కవుటైంది. నీలాంబరిగా.. శివగామిగా మోస్ట్ పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన రమ్యకృష్ణ దివంగత ముఖ్యమంత్రి జయలలితగా మెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రమ్య ఈ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఖాయం. ఇక సౌతిండియాలోనే గ్రేట్ టెక్నీషియన్ గా పేరున్న గౌతమ్ మీనన్ తన శిష్య వర్గంతో పూనుకుని `క్వీన్` వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తుండడంతో ఇప్పుడు ఇతర బయోపిక్ లపై అది ఏమేరకు ప్రభావం చూపిస్తుందోనన్న అనుమానాలు మొదలయ్యాయి.
Please Read Disclaimer