ట్రైలర్ టాక్: రాహు

0

ఈ మధ్యకాలంలో రెగ్యులర్ పోకడలకు భిన్నంగా టాలీవుడ్ లో సరికొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వస్తోందే రాహు. దీని టీజర్ ని యూనిట్ విడుదల చేసింది. అభిరాం వర్మ హీరోగా క్రితి గార్గ్ హీరోయిన్ గా నటించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో స్వామి – బాబ్జి – కాలకేయ ప్రభాకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. 55 సెకండ్లు నిడివి ఉన్న టీజర్ లో చూచాయగా కథలోని పాయింట్ ని రివీల్ చేసే ప్రయత్నం చేశారు.

నెత్తురు చూస్తేనే భయపడిపోయి కళ్ళు మూతలు పడే బలహీనత ఉన్న అమ్మాయి(క్రితి గార్గ్)జీవితంలో అనూహ్యమైన భయానక సంఘటనలు ఎదురవుతాయి. రాంగ్ గర్ల్ రాంగ్ టైం రాంగ్ ప్లేస్ తరహాలో ఊహించని ప్రమాదాలు పలకరిస్తాయి. అసలు ఇవన్ని ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని అయోమయంలో ఉండగా తనను ఏకంగా హత్య చేసే ప్రయత్నాలు జరుగుతాయి. అదేంటో తెలియాలంటే రాహు చూస్తేనే సమాధానాలు దొరుకుతాయి

దర్శకుడు సుబ్బు వేదుల టేకింగ్ మంచి స్టాండర్డ్ లో ఉంది. అనవరసమైన ప్రహసనాలకు తావివ్వకుండా స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వెళ్ళిన విధానం బాగుంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సురేష్ – ఈశ్వర్ ల ఛాయాగ్రహణం థీమ్ కు తగిన సాంకేతిక సహకారం అందించి సస్పెన్స్ ని బాగా ఎలివేట్ చేసేందుకు హెల్ప్ అయ్యాయి. థ్రిల్లర్ లవర్స్ ని బాగా ఇష్టపడే వాళ్ళకు ఇన్స్ టాంట్ గా కనెక్ట్ అయ్యేలా ఉన్న రాహు మొత్తానికి అంచనాలు రేపడంలో సక్సెస్ అయ్యింది. త్వరలోనే విడుదల ప్లాన్ చేసిన రాహు టీజర్ తో మంచి ఇంప్రెషన్ అయితే కలిగించింది.
Please Read Disclaimer