త్వరలో ‘ఓటిటి’లోకి ట్రిపుల్ రోల్ హారర్ సినిమా!

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో లక్ష్మీ రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సినిమాల కంటే కూడా ఎక్కువగా వివాదాలల్లోనే నిలిచింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్దం గడిచినా ఇప్పటివరకు సరైన గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అందంతో పాటు నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడుకి హీరోయిన్ గా కంటే ఐటెం సాంగ్స్ ద్వారానే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికి ఈ భామ హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఎక్కువగా హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తూ ఉండటంతో అప్పుడప్పుడు ఆ జోనర్ లో ఎక్కువగా లక్ష్మి రాయ్ సినిమాలు చేస్తూ వస్తుంది. హర్రర్ సినిమాలలో సత్తా చాటుతున్న సక్సెస్ మాత్రం రానంటుందట. అయితే ఈసారి లక్ష్మీరాయ్ ఏకంగా మూడు పాత్రలలో మెప్పించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సిండ్రెల్లా అనే తమిళ హారర్ థ్రిల్లర్ లో ఈ అమ్మడు నటిస్తుంది.

కెరీర్లో ఫస్ట్ టైమ్ ట్రిపుల్ రోల్ చేస్తుంది. ఈరోజుల్లో డ్యూయల్ రోల్ దొరకడమే కష్టం అనుకుంటే.. ఏకంగా సిండ్రెల్లా సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తుంది లక్ష్మి రాయ్. ఇందులో టైటిల్ రోల్ తో పాటు రాక్ స్టార్ గా దయ్యంగా కనిపించనుందట. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులే వచ్చాయి. దీనితో చాలా సినిమాలు థియేటర్స్ లేక నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. అలా ఇటీవలే తమిళంలో జ్యోతిక నటించిన “పొన్ మగళ్ వందల్” చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. అలాగే కీర్తి సురేష్ నటించిన “పెంగ్విన్” కూడా ఇదే జూన్ లో రానుంది. అయితే ఇదే బాటలో తాజాగా లక్ష్మి రాయ్ మెయిన్ లీడ్ లో నటించిన “సిండ్రెల్లా” సినిమా రానుందని సమాచారం. ఈ సినిమా అతి త్వరలోనే డైరెక్ట్ ఓటిటి లోకి రానున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా లక్ష్మి రాయ్ కి ఎంతవరకు గుర్తింపు తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి!
Please Read Disclaimer