దుబాయ్ బికినీ దేవత

0

సౌత్ మొత్తం మీద ఉండే హాటు భామల్లో రాయ్ లక్ష్మి ఒకరు. కన్నడ.. తమిళం.. తెలుగు సినిమాలను ఫుల్లుగా కవర్ చేసిన ఈ భామ హిందీలో కూడా ఒక సినిమాలో ప్రధాన పాత్రలో నటించిందంటేనే మనం రాయ్ గారి క్రేజు అర్థం చేసుకోవచ్చు. ఈ తరంలోని ఇతర హాటు చురకత్తుల లాగానేఈ భామ సోషల్ మీడియాను సెల్ఫ్ ప్రమోషన్ కు ఫుల్లుగా వాడుకుంటుంది. ఏదో ఒక హాట్ ఫోటో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఈ భామ గత కొన్ని రోజులుగా దుబాయ్ వెకేషన్ లో ఉంది. అక్కడ బీచుల్లో సరదాగా గడుపుతూ జీవితంలోని మాధుర్యాన్ని తనివితీరా అస్వాదిస్తోంది. తాజాగా రాయ్ ఒక కొత్త ఫోటోను పోస్ట్ చేసి “సూర్యకాంతిని కొంచెం తుఫానుతో కలిపి ఇలా” అంటూ ఒక సూపర్ కొటేషన్ ఇచ్చింది. తను హాట్ తుఫాను అని పరోక్షంగా నెటిజన్లకు బికినీతో సందేశం ఇచ్చింది. ఈ ఫోటోలో ఆరెంజ్ కలర్ టాప్.. బ్లాక్ కలర్ మినీ షార్ట్ ధరించింది. ఈ డ్రెస్సును పూర్తిగా బికినీ అనలేం కానీ బికినీ లాగానే కనిపిస్తోంది. ఒక స్టార్ హోటల్ లోని రూఫ్ టాప్ పైన రిలాక్సింగ్ ఛెయిర్ పైన మోకాళ్లపై నిలుచుని కెమెరాను సూటిగా సుత్తి లేకుండా చూస్తోంది. రింగుల జుత్తు.. వెడల్పాటి చెవి రింగులు.. పెద్ద చలువ కళ్లజోడు ధరించి నిజంగా హాటు తుఫాను తరహాలోనే కనిపిస్తోంది.

ఈ ఫోటోకు చాలామంది నెటిజన్లు ఫిదా అయ్యారు. “రియల్ హరికేన్”.. “దుబాయ్ మీద పడ్డావా?”.. “ఎందుకిలా ఏడిపిస్తావు?”.. అంటూ రేసుగుర్రం శృతి హాసన్ లా కాకుండా తమ స్పందనలు తెలిపారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో ‘సిండ్రెల్లా’ అనే చిత్రంలోనూ.. కన్నడలో ‘ఝాన్సి’ అనే మూవీలోనూ నటిస్తోంది.
Please Read Disclaimer