మరీ ఎక్కువ నవ్వేస్తే కాఫీ చల్లారుతుందేమో!

0

ఆ నవ్వు చూస్తుంటే .. లోకంలో ఇంతకంటే ఆహ్లాదకరమైన నవ్వు ఇంకోటి ఉండదేమో! అనిపిస్తోంది కదూ? అంతగా పడి పడి నవ్వేస్తుంటే ఆ తన్మయత్వంలో అసలేం జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. మనసంతా ఏదో గమ్మత్తయిన ఫీలింగ్ ఈ యంగ్ పెయిర్ ని కమ్మేసినట్టే కనిపిస్తోంది. అందుకే అలా మనస్ఫూర్తిగా నవ్వేసుకుంటున్నారు. ఇంతకీ చేతిలో కాఫీ కప్ తో సాయిధరమ్ ఏం జోక్ వేశాడో ఏమిటో రాశీ మోములో అసలు నవ్వు ఆగడం లేదు.

ఇంత అందమైన జంటను చూస్తుంటే కళ్లు పక్కకు తిప్పుకోవడం కష్టమే. ప్రతిరోజూ పండగే ఆ జోడీ కళ్ల ముందు ఉంటే! సుప్రీంహీరో సాయిధరమ్ – రాశీఖన్నా చూడముచ్చటైన జంటగా కనిపిస్తున్నారు. ఈ జంటను మారుతి ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తున్నాడో చెప్పేందుకు ఈ ఒక్క ఫోటో చాలు. ఎంతో కళాత్మకమైన ఫ్రేములతో సినిమా ఆద్యంతం జనరంజకంగానే తీర్చిదిద్దుతున్నాడని పడి పడి నవ్వుకునేలా సీన్స్ మలుస్తున్నాడని అర్థమవుతోంది.

సాయిధరమ్ సింపుల్ టీషర్ట్ వేసుకుని కనిపిస్తుంటే రాశీ ఆరెంజ్ కలర్ చీరకు కాంబినేషన్ బ్లౌజులో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ నవ్వు చూస్తుంటే ముత్యాలు కెంపులు రాలునేమో! అన్నంతగా ఉంది మరి. అన్నట్టు అలా నవ్వేస్తూ కాఫీ తాగడం మర్చిపోతే ఎలా? చల్లారుతుందేమో! కాసింత సాయిధరమ్ ఏదో లోకంలోంచి ఇహలోకంలోకి వస్తే బావుంటుంది మరి!! జీఏ2 పిక్చర్స్- యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కట్టప్ప అలియాస్ సత్యరాజ్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు.
Please Read Disclaimer