ఇంకా ఏం జాగ్రత్త పడతావులే రాశి!

0

బ్యూటిఫుల్ రాశి ఖన్నా కెరీర్ మొదటి నుంచి ఒక హిట్.. రెండు మూడు ఫ్లాపులు అన్నట్టుగా కొనసాగుతోంది. ఇక స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకునేంతలో ఫ్లాపులు తగలడం.. కెరీర్ నాలుగు అడుగులు వెనక్కు పోవడం కామన్ గా మారింది. పోయినేడాది ‘వెంకీమామ’.. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో రెండు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మంచి ఊపులో ఉంటుందని అనుకుంటే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.

రాశి ఈమధ్య ఓ సందర్భంలో తన లాస్ట్ సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గురించి సన్నిహితులతో మాట్లాడుతూ ఆ సినిమా తనను నిరాశకు గురిచేసిందని చెప్పిందట. తన పాత్ర సంతృప్తిని కలిగించినప్పటికీ సినిమా డిజాస్టర్ కావడంతో ఇకపై తన పాత్రల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త పాటిస్తానని చెప్పుకొచ్చిందట. ఇదంతా బాగానే ఉంది కానీ రాశి కెరీర్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని పెద్దగా ఉపయోగం ఉండదని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా లైన్ లో ఉంది. మరో సినిమా ‘షైతాన్ కా బచ్చా’ ఆగిపోయిందట. తెలుగులో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తర్వాత మరో సినిమా సైన్ చెయ్యలేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-