రాశీ ముంబై స్నేహాలు దేనికోసమో!

0

సాయి తేజ్ సరసన `ప్రతి రోజు పండగే` చిత్రంలో నటిస్తోంది రాశీఖన్నా. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టిక్ టాక్ బ్యూటీగా రాశీ విన్యాసాలు కడుపుబ్బా నవ్విస్తాయని ప్రచారమవుతోంది. కథానాయకుడి మరదలి పిల్లగా అదిరిపోయే రొమాన్స్ చేయబోతోందని ఇటీవలే రిలీజైన టీజర్.. సాంగ్ వెల్లడించాయి. ఇక రాశీ పాత్రను మారుతి చాలా జాగ్రత్త తీసుకుని ప్రత్యేకంగా తీర్చిదిద్దారన్న టాక్ వినిపిస్తోంది.

పచ్చని పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఆద్యంతం పండగలానే సాగే ఈ చిత్రంలో అక్క బావా అంటూ ఓ లేడీ గ్యాంగ్ అలరించనుందని ఇంతకుముందు రిలీజ్ చేసిన సాంగ్ టీజర్ రివీల్ చేసింది. ఇకపోతే రాశీఖన్నా వెకేషన్ కి సంబంధించిన ఓ ఫోటో అంతర్జాలంలో రివీలైంది. అది కూడా తన ముంబై స్నేహితురాలు వాణీ కపూర్ తో కలిసి వెకేషన్ కి వెళ్లినప్పటి ఫోటో. వాణీతో ఎంతో సన్నిహితంగా ఉంది రాశీ. తనతో ఉన్న సాన్నిహిత్యం చూస్తుంటే యశ్ రాజ్ ఫిలింస్ కి రికమండ్ చేస్తోందా? అన్న సందేహం కలగక మానదు. ఆహా కళ్యాణం- వార్ లాంటి చిత్రాల్ని వాణీ ఈ బ్యానర్ లోనే చేసింది కాబట్టి తనకు హిందీ పరిశ్రమలో లైన్ క్లియర్ చేస్తుందా? అన్నది చూడాలి.

నేడు రాశీ ఖన్నా బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. సాయితేజ్ అభిమానులు సైతం రాశీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ప్రతిరోజూ పండగే ఫోటోల్ని వీడియోల్ని షేర్ చేస్తున్నారు. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతిరోజు పండగే టీమ్ కి రాశీ ధన్యవాదాలు తెలిపింది. బాస్ అరవింద్- మారుతి సమక్షంలో రాశీ బర్త్ డే కేక్ కట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer