బర్త్ డే టీజర్: నిక్కర్లు వేసుకొని తిరిగేదట!

0

వెంకటేష్.. నాగ చైతన్య నటిస్తున్న మల్టిస్టారర్ ఫిలిం ‘వెంకీమామ’. ఈ సినిమాలో రాశి ఖన్నా.. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈరోజు రాశి ఖన్నా పుట్టినరోజు కావడంతో ‘వెంకీమామ’ టీమ్ ఒక ప్రత్యేకమైన టీజర్ విడుదల చేశారు. ఈమధ్య నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్ టీజర్ ను విడుదల చేసినట్టే ఈరోజు రాశి ఖన్నా కోసం టీజర్ రిలీజ్ చేయడం విశేషం.

పదిహేడు సెకన్లే ఉండే ఈ వీడియో ఆరంభంలో మోడరన్ డ్రెస్ ధరించి బోటుపైన నిలుచుని రాశి ఖన్నాను చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో “నీతో ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఊహించుకున్నాను” అంటూ ఎమోషనల్ గా చైతుతో చెప్తుంది. నెక్స్ట్ సీన్లో చైతుకు బుగ్గపై ఒక ముద్దును కూడా ఇస్తుంది. బీచ్ లో చైతు-రాశి పరిగెడుతూ ఉండే సీన్ అయితే ఒక పెయింటింగ్ లాగా ఉంది. అందరూ ఉన్నారు వెంకీమామ పంచ్ డైలాగ్ లేకపోతే ఎలా? అందుకే రాశిని చూసిన వెంకీ “ఎప్పుడో చిన్నపుడు చూశాను.. చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని తిరిగేదానివి” అంటూ రాశి.. రాశి ఫ్రెండ్స్ అవాక్కయ్యేలా చేస్తాడు.హైలైట్ ఏంటంటే ఈ సీన్ లో చాలా పొట్టిగా ఉండే మిడ్డీ ధరించి ఉండడం. లాస్ట్ సీన్ లో చైతు లవ్ బెలూన్స్ పట్టుకున్న స్కూల్ పిల్లల మధ్యలో రాశికి బ్యూటిఫుల్ గా లవ్ ప్రపోజ్ చెయ్యడం. థమన్ నేపథ్య సంగీతం. గోదావరి విజువల్స్ అందంగా ఉన్నాయి. బర్త్ డే టీజర్ అదిరిపోయింది.

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సినిమాను సురేష్ బాబు.. టీ.జీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer