ఫేమస్ లవర్ ని చూసి షాకైందట!

0

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన `వరల్డ్ ఫేమస్ లవర్` ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నలుగురు భామలు ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. క్రాంతి మాధవ్ దర్శకుడిగా కె.ఎస్.రామారావు – వల్లభ నిర్మించారు. ఈ బుధవారం సాయంత్రం వైజాగ్ లో వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పంచె కట్టు .. తలపాగతో విజయ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. వైజాగ్ రౌడీ ఫ్యాన్స్ విజయ్ యాటిట్యూడ్ కి ఫిదా అయిపోయారు.

ఇక ఇదే వేదికపై విజయ్ యాటిట్యూడ్ కి కథానాయిక రాశీ ఖన్నా స్పెల్ బౌండ్ అయిపోయిందట. అంతేకాదు విజయ్ పంచెకట్టు చూసి రాశీ స్టన్నయిపోయానని ఆశ్చర్యపోయానని రాశీ తెలిపింది. ప్రతిసారీ విజయ్ నుంచి ఏదో ఒకటి ఊహించనిది చూస్తుంటాం. ఈ సారి కూడా అలా కొత్తగా కనిపించాడు అంటూ మంత్రముగ్ధం అయిపోయింది రాశీ. ఇక ఆ మూవీలో సీనయ్య పాత్రను ప్రతిబింబించే అవతారంలో దేవరకొండ కనిపించాడు. ఆ పాత్రతో తాను ఎలా కనెక్టయ్యాడో విజయ్ ఈ వేషధారణతో చెప్పకనే చెప్పాడు. ఇక వైజాగ్ – ఉత్తరాంధ్ర ఫ్యాన్స్ లవ్ కి విజయ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వేదికపై రాశీఖన్నా లుక్ సైతం అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. మునుపటితో పోలిస్తే రాశీ పూర్తిగా స్లిమ్ అయ్యి కనిపించింది.

ఇప్పటికే వైజాగ్ థియేటర్లకు సంబంధించిన అన్ని టికెట్లు అమ్ముడైపోయాయని పంపిణీదారుడు ప్రీరిలీజ్ వేడుకలో ప్రకటించడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇరు తెలుగు రాష్ట్రాలలో వరల్డ్ ఫేమస్ లవర్ దాదాపు 22కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తోంది. అయితే ఇంత పెద్ద మొత్తం వసూళ్లను సాధించాలంటే వరల్డ్ ఫేమస్ లవర్ భారీ ఓపెనింగ్స్ సాధించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 13 నుంచి ఓవర్సీస్ సహా అన్నిచోట్లా ప్రీమియర్లకు ఏర్పాట్లు సాగుతున్నాయి. నాలుగు విభిన్న ప్రేమకథల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశి ఖన్నా- ఐశ్వర్య రాజేష్- క్యాథరిన్ థ్రెస్సా- ఇసబెల్లా ఒక్కో ప్రేమకథలో ఒక్కొక్కరుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.
Please Read Disclaimer