పెదవి ముద్దులు తడిపొడి సీన్లు తప్పేంటి?

0

వెండితెరపై సుదీర్ఘ చుంబనాలకు.. బాత్ రూమ్ సన్నివేశాలకు .. బెడ్ రూమ్ లో వేడెక్కించే స్టీమీ సీన్లకు ఓకే చెప్పాలంటే గట్స్ ఉండాలి. ఆ తరహా గట్స్ రాశీఖన్నాకు ఉన్నాయనడంలో సందేహమేం లేదు. ఈ భామ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ ఎలివేషన్ కి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. పరిధిమేర ఎక్స్ పోజింగ్ కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో రాశీ ఫైరింగ్ చూసిన వారికి షాక్ తగలాల్సిందే.

ఇక పెద్ద తెరపై కథానాయకులతో రాశీ రొమాన్స్ అంతే వేడెక్కిస్తోంది. ఇటీవలే `ప్రతిరోజూ పండగే` చిత్రంలో టిక్ టాక్ సుందరిగా అద్భుతంగా అభినయించింది. రాశీ నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవలే ట్రైలర్ రిలీజైంది. ఇందులో విజయ్ దేవరకొండతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ భామ జీవించింది. ఇక ఈ మూవీలో పెదవి ముద్దులకు .. ఘాటైన సీన్లకు కొదవేమీ లేదని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. రాశీ బాత్రూమ్ సన్నివేశం బ్యాక్ లెస్ లుక్ ఇప్పటికే యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.

అయినా ఆ తరహా సీన్లను ముందే జడ్జి చేసేయొద్దు. ముందు సినిమా చూడండి. కన్విన్సింగ్ గానే ఉంటాయి. అక్కడ సీన్ డిమాండ్ మేరకే ఆ తరహా సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఇంటెన్సిటీ కోసం చేసినవి. అయితే ఉద్ధేశపూర్వకంగానో ప్రచారం కోసమో వాటిని కావాలని ఇరికించలేదు! అంటూ పక్కా క్లారిటీ ఇచ్చింది రాశీ. మొత్తానికి రౌడీ గారితో రొమాన్స్ కి రాశీ ఇంతగా తపించిందా? అన్నట్టుగానే ఉందీ జవాబు.
Please Read Disclaimer