ట్రాలింగ్ చేసినందుకే స్లిమయ్యానన్న భామ!

0

సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయాక అభిమానుల అభిప్రాయాలు నేరుగా తారలకే చేరిపోతున్నాయి. అవి కొన్ని సార్లు వాళ్లకు ఉపయోగపడుతుండగా మరికొన్ని సార్లు ఇబ్బందులు కూడా కలిగిస్తుంటాయి. మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్న వాళ్లకు ఇది సహజంగా వచ్చే సమస్యే కాబట్టి సర్దుకోవడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. హీరోయిన్ రాశి ఖన్నా మాత్రం తనను కామెంట్ చేసిన వారికి బదులుగా దాన్నో ఛాలెంజ్ గా తీసుకున్న సందర్భాన్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

దాని ప్రకారం రవితేజ బెంగాల్ టైగర్ విడుదలైనప్పుడు రాశి ఖన్నా లుక్స్ మీద చాలా కామెంట్స్ వచ్చాయి. బాడీ షేప్ లేకుండా బికినీ ఎందుకు వేసుకున్నావని కొందరు నిలదీశారు కూడా. దీన్ని సీరియస్ గా తీసుకుని ఎదురుదాడి చేయకుండా తాను బొద్దుగా ఉన్న నిజాన్ని గుర్తించి అప్పటి నుంచి షేపింగ్ మీద ఫోకస్ పెట్టిందట. ఏది ఒక్క రోజులో సాధ్యం కాదని రెండేళ్లు కష్టపడితే ఇప్పుడున్న ఫిజిక్ దక్కించుకున్నానని చెప్పిన రాశి ఖన్నా డైట్ తీసుకునే విషయంలో జిమ్ ని ఫాలో అయ్యే రూల్స్ లో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట.

వారంలో ఆరు రోజులు క్రమం తప్పకుండా ఇవి ఫాలో అవుతానని అందువల్లే అభిమానులు కోరుకున్న తీరులో ఇవాళ మార్పు తెచ్చుకోగలిగానని సంతోషం వ్యక్తం చేసింది. వరుణ్ తేజ్ తొలిప్రేమలో రాశి ఖన్నాను చూసినప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ లుక్ ని అలాగే మైంటైన్ చేస్తూ వచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాతో పాటు సాయి తేజ్ ప్రతి రోజు పండగేలో నటిస్తోంది. తెలుగులో కన్నా తమిళ్ లో వరస ఆఫర్లు కొట్టేస్తున్న రాశి ఖన్నా మొత్తానికి ట్రాలింగ్ కి మాటలతో కాకుండా చేతలలో సమాధానం చెప్పి స్ఫూర్తిగా నిలిచిందని అదే నెటిజెన్లు పొగడ్తలు గుప్పిస్తున్నారట
Please Read Disclaimer