టాలీవుడ్ పాలకోవా పాప

0

టాలీవుడ్ లో చాలామందే బ్యూటీలు ఉన్నారు కానీ గ్లామరస్ బ్యూటీలు అంటే మాత్రం గుర్తుకు వచ్చే కొద్దిమందిలో రాశి ఖన్నా ఒకరు. రాశి బార్బీ డాల్ లాగా ఉంటుంది కాబట్టే తన కెరీర్ ఆరంభంలో అన్నీ అలాంటి పాత్రలే చేసింది. వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ వచ్చే వరకూ రాశికి నటన విషయంలో పెద్దగా గుర్తింపు లేదు. కానీ ‘తొలిప్రేమ’ మొదటిసారిగా తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అయితే పెద్ద ఎంత నటి అయినా గ్లామర్ కు బై బై చెప్పదు కదా రాశి తన గ్లామర్ ఎటాక్స్ ను కంటిన్యూ చేస్తోంది.

రాశి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాలో తనకు 3.4 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. వారికోసం రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉంటుంది. రీసెంట్ గా రాశి ఖన్నా కీర్తిలాల్స్ వారి ఫరెవర్ మార్క్ జ్యూయలరీ స్టోర్ ఓపెనింగ్ కు హాజరయింది. అసలే వజ్రాల దుకాణం.. అందుకే అద్బుతంగా ఒక యువరాణి తరహాలో రెడీ అయింది. క్రీమ్ కలర్ స్లీవ్ లెస్ గౌన్ ధరించిన రాశి ఆ డ్రెస్ కు తగ్గ యాక్సెసరీస్ ధరించి చూపరుల మతిపోగొట్టింది. ఆ ఫోటోను తన ఇన్స్టా ఖాతా లో షేర్ చేసింది. మెడలో సన్నగా ఉన్న చెయిన్.. చేతులకు సింగిల్ బ్యాంగిల్స్ ధరించింది. అయితే తన ఫోటోకు ఇచ్చిన క్యాప్షన్ లో మాత్రం ఇయర్ రింగ్స్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ ఫరెవర్ మార్క్ రెడ్ కార్పెట్ కలెక్షన్ కోసం ఈ ఇయర్ రింగ్స్ ను ఎక్స్ క్లూజివ్ గా డిజైన్ చేశారని వెల్లడించింది.

ఈ ఆభరణాలు.. వాటి విశేషాలు లేడీస్ కు ఇంట్రెస్టింగ్ గా.. జెంట్స్ కు నీరసంగా అనిపించడం ఖాయం. అందుకే ఫోటో గురించే మాట్లాడుకుందాం. రాశి ఖన్నా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం సన్నజాజి తీగలాగా నాజూగ్గా తయారయింది. నాజూగ్గా మారడమే కాదు.. ఫిగర్ ను అందంగా మెయింటెయిన్ చేస్తోంది. ఈ ఫోటోలో రాశి స్మైల్ కూడా అదిరిపోయింది. అందుకే ఈ ఫోటోకు “పాలకోవా”.. “వండర్ఫుల్ డ్రెస్.. అట్రాక్టివ్ స్మైల్”.. “క్యూట్ ప్రిన్సెస్” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘వెంకీ మామ’ తో పాటుగా తమిళంలో ‘షైతాన్ కా బచ్చా’.. ‘కడైసి వ్యవసాయి’.. ‘సంగ తమిళన్’ అనే సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer