కోహినూర్ డైమండ్

0

టాలీవుడ్ లో చాలామంది నార్త్ బ్యూటీలే ఉన్నారు కానీ వారిలో గ్లామర్ కు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది మాత్రం రాశి ఖన్నానే. నిజానికి మన ఫిలిం మేకర్లు మొదట్లో రాశికి వరసగా గ్లామర్ పాత్రలే ఇచ్చి గ్లామర్ డాల్ ను చేశారు. అయితే వరుణ్ తేజ్- వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ తో మొదటిసారి రాశి ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది. అలా అని గ్లామర్ కు గుడ్ బై ఏమీ చెప్పలేదు. గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్ల గుండెల్లో గునపాలు దించుతూనే ఉంది.

ఈ భామ ప్రస్తుతం చాలా సినిమాలలో నటిస్తోంది. ఆ లిస్టులో ‘సంగతమిళన్’ అనే ఒక తమిళ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరో. అక్టోబర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారట. దీంతో ‘సంగ తమిళన్’ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఆ ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు రాశి చక్కగా తయారైంది. ఈ ఫోటోలనే తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఎంతో ఆకర్షణీయంగా ఉండే రెడ్ కలర్ డ్రెస్ ధరించి చిరునవ్వులు రువ్వుతూ పోజులిచ్చింది. ఒక ఫోటోలో మాత్రం నవ్వు లేకుండా ఒక సెన్సువల్ పోజిచ్చింది. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్.. చేతులకు రిస్ట్ బ్యాండ్స్ ధరించి స్టైలింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంది. అందాల వడ్డన పెద్దగా లేకపోయినా తన అందంతో నెటిజన్ల మనసును దోచేందుకు రెడీ అయింది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందనే దక్కింది. “ఫోటోలా పెయింటింగ్సా?”.. “కోహినూర్ డైమండ్”.. “మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్” అంటూ కొందరు నెటిజన్లు తమ స్పందన తెలిపారు. ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో ‘వెంకీ మామ’ లో నటిస్తోంది. తమిళంలో ‘షైతాన్ కా బచ్చా’.. ‘కడైసి వ్యవసాయి’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer