చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్న రాశీఖన్నా

0

స్క్రీన్ మీద కనిపించే మొదటిసారి ఆర్టిస్టులకు ఎంత ఎగ్జైట్ మెంట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల్లో ఒక గుర్తింపు పొంది.. తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత కొత్త తరహా ప్రయోగాలు చేసేందుకు పేరున్న స్టార్లు వెనక్కి తగ్గుతుంటారు. అయితే.. ప్రయోగాల్ని ఆహ్వానించే వారు మాత్రం వెనక్కి తగ్గరు. తాజాగా అలాంటి పనే చేసింది టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా.

బొద్దు గుమ్మగా ఉన్న ఈ భామ గడిచిన కొంత కాలంగా స్లిమ్ అయిపోయిన తర్వాత మరింతగా మెరిసి పోతుందంటుననారు. తాజాగా ఆమె చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ కోసం కొత్త ప్రయోగానికి సిద్ధమైంది రాశీ. ఈ చిత్రంలో తొలిసారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. అంటే.. ఆమె ఒరిజినల్ వాయిస్ ను తొలిసారి వినబోతున్నామన్న మాట.

సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో యూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. తన పాత్రకు తాను తొలిసారి డబ్బింగ్ చెప్పుకోవటంపై రాశీఖన్నా మహా ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. గొంతు సరిగా లేదేమోనని..పద ఉచ్చారణ లయ తప్పుతుందేమోనన్న భయం కాస్త ఉన్నప్పటికీ.. తాను డబ్బింగ్ చెప్పానని.. తీరా వచ్చిన అవుట్ పుట్ చూసుకున్న తర్వాత తనకే ఆశ్చర్యంగా ఉందని ఆనంద పడిపోతోంది.

రాశీ సంతోషం చూస్తే.. రానున్న రోజుల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవటం ఖాయమంటున్నారు. ప్రేక్షకులకు తన వాయిస్ ను వినిపించటం కోసం తాను చాలా ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు రాశీ చెబుతోంది. మరి.. అమ్మడి గొంతు ప్రేక్షకుల్ని మరెంతగా మరిపిస్తుందో చూడాలి.
Please Read Disclaimer