బాపు బొమ్మవా? నాయుడు గారి ఎంకివా?

0

బాపు బొమ్మలా.. పల్లెపట్టు ఆడపడుచులా..ఇంతకీ ఎవరీ ముద్దుగుమ్మ? అందం అంటే నీవా? అంటూ బోయ్స్ ఒకటే ఇదైపోతున్నారు. అందానికి అందం .. అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో గుండెల్ని చిదిమేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో ప్రత్యేకించి చెప్పాలా?… షి ఈజ్ రాశీ ఖన్నా. డేరింగ్ దిల్లీ బ్యూటీ.

2019 ఎండింగ్లో `ప్రతిరోజు పండగే` చిత్రంతో బిగ్ హిట్ ని సొంతం చేసుకుంది రాశిఖన్నా. ఏంజిల్ ఆర్నాగా టిక్ టాక్ వీడియోలతో తనదైన శైలిలో ఆకట్టుకుంది. ఆ తరువాత చేసిన `వరల్డ్ ఫేమస్ లవర్` పెద్దగా ఆశించిన ప్రభావాన్ని చూపించలేకపోయింది. హిట్ కోసం మరింత హాట్ గా కనిపించేందుకు ప్రయత్నించి హాట్ సీన్ లలో నటించినా ఫ్లాప్ టాక్ రావడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

దీంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసిన రాశి అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారరిపోయింది. అక్కడి వారిని ఆకట్టుకోవాలంటే ఎంత చేయాలో అంతచేస్తోంది. ఇటీవల లైట్ క్రీమ్ డ్రెస్ లో బటన్స్ విప్పేసి అందాల్ని పరిచి హీటెక్కించిన రాశిఖన్నా ఇంతలోనూ ఫోటో షూట్ పరంగా ప్రయోగానికి తెర తీసింది. రకరకాల డిజైనర్ లుక్స్ తో శారీ లుక్ తో వెరైటీలు ట్రై చేస్తూ ట్రాక్ మార్చేసింది.

రాశీ లేటెస్ట్ ఫోటోషూట్ హాట్ టాపిక్ గా మారింది. ఈ షూట్ లో పక్కా పల్లెటూరి గుమ్మలా బాపు బొమ్మలా ముస్తాబై షాకిస్తోంది. ఇంతకుముందు లంగా ఓణీలో దర్శనమిచ్చి హార్ట్ బీట్ పెంచేసిన రాశి తాజాగా చీరకట్టులో కనిపించి నాజూకు నడుమందాలతో గుండెల్ని పిండేస్తోంది. ఏదో ఆత్రంగా నాయుడు మామ కోసం వేచి చూస్తున్న ఎంకిలాగా.. కొంటె చూపులు చూస్తూ పిచ్చెక్కిస్తోంది. రాశిఖన్నా తాజా ఫొటోషూట్ కి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సైతాన్కా బచ్చ… తుగ్లక్ దర్బార్ చిత్రాల్లో రాశీ నటిస్తోంది. తెలుగులోనే ఆఫర్లు ఏమిటన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉందింకా.