నేత్ర దానం చేసిన అందాల రాశీ

0

గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే యంగ్ బ్యూటీ రాశీఖన్నా. చాలా వరకు తన సినిమాల్లో అలా వచ్చి.. ఇలా పోయే పాత్రలకే పరిమితమవుతోందన్న విమర్శను ఎదుర్కొంటోంది. చాలా రేర్ గా అల్లరితనం చిలిపి తనం ఉన్న పాత్రలతో కామెడీ చేసి ఆకట్టుకుంది. కెరీర్ గ్యాప్ అన్నదే లేకుండా.. బతక నేర్చిన కథానాయికగా పేరు తెచ్చుకున్న రాశీ నిత్యం తన కాల్షీట్లు బిజీగా ఉండేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటోంది. హైదరాబాద్ లోనే సెటిల్ అయిన ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు ఓ గొప్ప పనే చేసింది. తన కళ్లని దానం చేసింది.

ఇటీవల ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈ భామ నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. అంతేకాదు తన కళ్ళని కూడా దానం చేసినట్టు వెల్లడించింది. “నేను కళ్లు దానం చేశాను. మరి మీరు?“ అంటూ అవేర్ నెస్ పెంచే ప్రయత్నం చేసింది. అయితే ఆ సందర్భంలో దిగిన పలు హాట్ ఫోటోలను తాజాగా ట్విట్టర్ ద్వారా రాశీ అభిమానులతో పంచుకుంది. మైకం నిండిక కళ్ళతో వైట్ టాప్.. రెడ్ బాటమ్ డ్రెస్ ధరించి ఫోటోలకు పోజులిచ్చింది. ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫోటోలతో పాటు రాశీ పెట్టిన ట్వీట్ నెటిజనులకు మండిపోయేలా చేసింది.

రాశీ చేసిన ట్వీట్ చూస్తే.. “నేను మంటని అలాగే మంచుని కూడా… మీరు చలికి భయపడతారు… నిప్పుని కోరుకుంటారు“ అంటూ కన్ను గీటే ఎమోజీని షేర్ చేసింది. ఇదే నెటజనుల మంటకు కారణం. రాశీ ఏం చెప్పబోతోంది? ఉన్నట్టుండి మంట.. మంచు.. నిప్పు.. చలి అంటూ ఈ కవిత్వం ఎందుకు? ఆ ట్వీట్ లో ఏమైనా అర్థం ఉందా రాశీ అంటూ నెటిజనం ఫైర్ అవుతున్నారు. ఒక్క రోజు ముందు ఎంతో గొప్ప పనిచేశావని మెచ్చుకున్న అభిమానులే తాజా తలతిక్క ట్వీట్ పై అక్షింతలు చల్లేశారు. ప్రస్తుతం అటు తమిళం.. ఇటు తెలుగు రెండు చోట్లా రాశీ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-