ఏపీ ప్రభుత్వంపై రాశీఖన్నా ప్రశంసలు

0

వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది రాశీఖన్నా. ఇటీవలే వెంకీమామ రిలీజైంది. రాశీ నటనకు ప్రశంసలు దక్కాయి. మరో వారంలో సాయి తేజ్ `ప్రతిరోజూ పండగే` చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టిక్ టాక్ బ్యూటీగా కుర్రకారు గుండెల్లో తిష్ఠవేసే పాత్రలో నటించింది. విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీటితో పాటు పలు క్రేజీ సినిమాలతో రాశీ బిజీగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో సెటిలైన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా కెరీర్ బండిని నడిపిస్తోంది.

తాజాగా దిశ చట్టాన్ని తీసుకువచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించింది. దిశ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సత్వరమే శిక్ష పడే ఇలాంటి చట్టాలు అవసరమని రాశీ పేర్కొంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లకు కఠినశిక్షలు విధించేలా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాశీ స్వగతించింది. గత శుక్రవారం ఏపీ శాసనసభ దిశ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు సెలబ్రిటీలు సహా కామన్ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తప్పు చేసేవాళ్లను భయపెట్టే ఇలాంటి పనులు చేయాలనుకునే వారికీ భయం కలిగించే చట్టమిదని.. పొరుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి చట్టం అమలు చేయాలని రాశీ కోరింది. దిశ చట్టం విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిందేనని ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం రాశీ ఇంటర్వ్యూ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Please Read Disclaimer