సెలబ్రెటీలు తేజును చూసి నేర్చుకోవాలబ్బా..!

0

సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు బూతులు తిట్టే.. అసభ్యకర వ్యాఖ్యలు చేసే నెటిజన్లను చూసి చాలామంది సెలబ్రెటీలు ఆవేశం తెచ్చేసుకుంటుంటారు. ఇక్కడ ఐడెంటెటీ లేకుండా ఏదో ఒక పేరు పెట్టుకుని సెలబ్రెటీల్ని టార్గెట్ చేస్తూ వాళ్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వాళ్లకు కొదవే ఉండదు. ఇలాంటి వాళ్లను పట్టించుకుంటే మనశ్శాంతి కోల్పోవడం తప్ప ఇంకేమీ ఉండదు. కాబట్టి చాలామంది మౌనం వహిస్తుంటారు. ఐతే కొందరు ఈ కామెంట్లకు తట్టుకోలేక తమ అసహనాన్ని చూపించి వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం ఇలా అదుపు తప్పే నెటిజన్లు తమ కామెంట్లకు సిగ్గుపడేలా సమాధానం చెప్పి వాళ్లలో పరివర్తన రావడానికి కారణమవుతారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ఇదే పని చేశాడు.

తేజు ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవలే ఓ బావా అంటూ ఒక పాట లాంచ్ చేశారు. ఈ పాటలోని లిరిక్స్తో తేజు – రాశి ఖన్నాల మధ్య ట్విట్టర్ లో ఒక సయ్యాట నడిచింది. ఇది రుచించక కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. ఒక వ్యక్తి తేజూను ఉద్దేశించి ఏరా సినిమాలో కూడా కామెడీ ఈ రేంజిలో ఉంటుందా అని ప్రశ్నించాడు. దీనికి తేజు సహనం కోల్పోకుండా దీనికి వెయ్యి రెట్లు ఉంటుందిరా అని కూల్గా బదులిచ్చాడు. దీంతో ఆ నెటిజన్ తన కామెంట్ కు సిగ్గుపడ్డాడు. గుడ్ లక్ అన్నా.. ఏదో తెలీక ఈ కామెంట్ చేశా అన్నాడు. తేజు బ్రహ్మి ఫన్నీ ఫొటో పెట్టి ఈ వ్యవహారానికి తెరదించాడు. నెటిజన్ల విషయంలో సెలబ్రెటీలు సైలెంటుగా అయినా ఉండాలి. లేదా వాళ్లు తమ కామెంట్లకు సిగ్గుపడేలా సమాధానం అయినా ఇవ్వాలని తేజు రుజువు చేశాడు.
Please Read Disclaimer