క్రేజీ రాశీ.. ఆ ఛాన్స్ ఎక్కడ అమ్మడూ?

0

అందం.. అభినయం వీటన్నిటినీ మించి లక్ కలిసొచ్చిన భామ రాశీ ఖన్నా. ఆరంభం బాలీవుడ్ లో నటించినా టాలీవుడ్ లో సరిగ్గా కెరీర్ ని సెట్ చేసుకోవడంలో పెద్ద సక్సెసైంది. కెరీర్ ప్రారంభించి ఐదేళ్లకు పైగానే గడిచిపోయినా… ఇన్నేళ్ల కెరీర్ లో భారీ విజయాలు ఉన్నాయా? అంటే లేనే లేవని చెప్పాలి. ఇటీవలే ఊహించని విధంగా కంబ్యాక్ అయ్యింది. వెంకీమామ- ప్రతిరోజు పండగే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. అయితే ఆ సక్సెస్ తనకు కలిసొచ్చిందా? అంటే.. క్రేజ్ పెరిగిందే కానీ ఛాన్సులు ఒక్కటీ కూడా లేవనే చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ లో నటిస్తోంది. ఇందులో రాశీ కి పోటీగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలున్నారు.

కాబట్టి రాశీ పాత్ర ఎలివేట్ అయ్యే అవకాశం పెద్దగా లేదు. ఒక సినిమాలో ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఉంటే.. నలుగురిలో తనకు దక్కే ప్రాధాన్యత ఎంత అన్నది చూడాలి. కాబట్టి ఫేమస్ లవర్ బ్లాక్ బస్టర్ అయినా రాశీకి ఓరిగేదేమి పెద్దగా ఉండదు. ఇప్పటివరకూ తెలుగులో మరో ప్రాజెక్ట్ కు సంతకం చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. అలాగని పొరుగున అయినా ఛాన్సులేవైనా ఉన్నాయా? అంటే అదీ లేదు. తమిళ్ లోనైనా బిజీగా ఉందా? అంటే అక్కడ ఇంతకన్నా ఘోరంగా ఉంది కెరీర్. ప్రస్తుతం అక్కడా సైతాన్ కా బచ్చా అనే ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. ఇది పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమా కాదు. సిద్దార్థ్ హీరోగా నటిస్తున్నాడు.

సిద్ధార్థ్ మంచి సక్సెస్ తో కంబ్యాక్ అవ్వాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా..అవి ట్రయల్స్ గానే మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాపై రాశీ ఆశలు పెట్టుకున్నా! కలిసొచ్చే సినిమా అయితే కాదని ముందే తేలి పోయింది. పైగా ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. ఆ రకంగా రాశీని ఇంకా బ్యాడ్ టైమ్ వెంటాడుతున్నట్లే కనిపిస్తోంది. రెండు వరుస విజయాలు తర్వాత ఏ హీరోయిన్ అయినా బిజీ అవుతుంది. కానీ అందాల రాశీకి మాత్రం ఇంకా కలిసొచ్చే సమయం రాలేదనే అర్థమవుతోంది. మరి స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కే యోగం ఉందా లేదా? క్రేజీ ఛాన్సులందుకుని కెరీర్ ని ఎప్పటికి పరుగులు పెట్టిస్తుందో చూడాలి.
Please Read Disclaimer