కన్ను గీటి టిక్ టాక్ వేషాలేమిటి రాశీ?

0

టిక్ టాక్ వేషాలు ప్రస్తుతం ట్రెండీ టాపిక్. ఇక్కడ వేయని వేషం లేదు. ఊరూ వాడా పల్లె పట్నం అనే తేడా లేకుండా మూల మూలలకు చేరిపోయింది ఈ వ్యసనం. ఆన్ లైన్ మాధ్యమంలో పిచ్చిని పరాకాష్టకు చేర్చడంలో టిక్ టాక్ ఘనత వహిస్తోంది. ఇక్కడ యూత్ వేలంవెర్రి వేషాలు ఒక కోణం అనుకుంటే.. మూల మూలన దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్న మాధ్యమంగానూ వేరొక కోణంలో పాపులరవుతోంది. ఇక దీని వల్ల లాభాల్ని మించి ప్రమాదాలు పెరిగాయి.

అయితే వీటన్నిటినీ మారుతి తన సినిమా `ప్రతి రోజు పండగే` లో చూపించనున్నారు. ఇందులో రాశీ ఖన్నా టిక్ టాక్ కి అడిక్ట్ అయిన మోడ్రన్ సుందరిగా నటిస్తోంది. ఇదిగో ఇక్కడ ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంతో సాంప్రదాయ బద్ధంగా కంచి పట్టు చీర కట్టుతో ఒళ్లంతా అలంకరించుకుని పుత్తడి బొమ్మను తలపిస్తున్న రాశీ టిక్ టాక్ వేషాలతో కొంటెగా కవ్విస్తోంది. కన్ను గీటి.. ముసిముసిగా నవ్వేస్తూ చాలా వేషాలు వేసింది.

బిహైండ్ ది సీన్స్.. బ్రాండ్ షూట్! అంటూ ఈ వీడియోని రాశీ స్వయంగా షేర్ చేసింది. ఇన్ స్టాగ్రమ్ కి ఫాలోవర్స్ ని పెంచుకునేందుకు ఇలా షేర్ చేస్తోందా? లేక సినిమాకి ప్రమోషన్ చేస్తోందా? లేక ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని పడేస్తోందా? అన్నది రాశీనే అడగాలి. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి మారుతి నేరుగా స్టార్ హీరో బన్నిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు. అందుకే ఇది అతడికి ఛాలెంజింగ్ మూవీ.

 

View this post on Instagram

 

Neeru : video le rahi Hun.. Me (inner voice) : I will make you regret it.. 🤣🤣 #behindthescenes #brandshoot @neeraja.kona

A post shared by Raashi Khanna (@raashikhannaoffl) onPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home