బాలయ్య సరసన 27 ఏళ్ల బంతిపువ్వు

0

నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా సెట్స్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. బోయపాటి బాలయ్య సరసన హీరోయిన్లను.. ఓ విలన్ ని వెతికే పనిలో బిజీ అయ్యారు. ఇప్పటికే బాలయ్యకు ప్రతి నాయకుడిగా బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ని దించుతున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక సెంటిమెంట్ గా ఇద్దరు భామల్ని ఎంపిక చేయనున్నారని ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరి ఆ కన్నడ బ్యూటీని ఫస్ట్ లీడ్ కోసమా.. లేక సెకెండ్ లీడ్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆ కన్నడ బ్యూటీ వయసు బాలయ్య ఏజ్ లో సగం కూడా ఉండదు. బాలయ్య ప్రస్తుతం 60 కి దగ్గరలో ఉన్నారు. అంటే ఇద్దరి మధ్య 33 సంవత్సరాలు వయసు తేడా ఉన్నట్లే. మరి బోయపాటి ఇంత సాహసం చేస్తున్నాడంటే? ఆ పాత్ర ప్రాముఖ్యత ఏమిటన్నది తెలియాల్సి ఉంది. బోయపాటి గతంలో `సింహా`లో ఒక హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ ని ఎంపిక చేసాడు. అప్పటి బాలయ్య వయసుకు…స్నేహ వయసకు వ్యత్యాసం చాలా ఎక్కువే. కానీ నయనతార మెయిన్ లీడ్ తీసుకుంది. స్టూడెంట్ పాత్రలోనే స్నేహ ఉల్లాల్ కనిపించింది.

మరి ఇప్పుడు 27 ఏళ్ల కన్నడ బ్యూటీని తీసుకుంటోన్న నేపథ్యంలో బోయపాటి ఆంతర్యం ఏమిటన్నది సస్పెన్స్. ప్రస్తుతం ఈ రూమర్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. రచితా రామ్ కన్నడలో బిజీ హీరోయిన్. ప్రస్తుతం ఆరేడు సినిమాలు చేస్తోంది. గ్లామర్ తారగా అక్కడి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా బాలయ్య సరసన ఈ బ్యూటీ అనే రూమర్ తో ఆమె ఫోటోలు టాలీవుడ్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.
Please Read Disclaimer