బాండ్ గాళ్ గా లెజెండ్ బ్యూటీ ట్రయల్

0

నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన `లెజెండ్` చిత్రంలో నటించింది రాధిక ఆప్టే. `లయన్` చిత్రంలోనూ బాలయ్య సరసన ఆడి పాడింది. అంతకుముందు ఆర్జీవీ `రక్త చరిత్ర`లోనూ తన నట ప్రతిభతో ఆకట్టుకుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ `లస్ట్ స్టోరీస్` తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. వీటన్నిటినీ మించి అడపా దడపా వివాదాలతోనూ ఈ అమ్మడు అందరికీ టచ్ లో ఉంది.

ఈ కాంట్రవర్శీ క్వీన్ డైరెక్టుగా హాలీవుడ్ కి షిఫ్టవ్వాలని అనుకుంది. ఏకంగా హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలోనే నటించేయాలని కలలు గందట. జేమ్స్ బాండ్ – ది స్టార్ వార్స్ లాంటి భారీ చిత్రాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు.. ఆ రెండు సినిమాల కోసం తనకు తానుగానే ఇంట్లో ఆడిషన్స్ చేసుకుని ఆ వీడియో క్లిప్పింగ్స్ ని కాస్టింగ్ ఏజెంట్లకు పంపించిందట.

అయితే వాటికి ఎంపిక అయ్యిందా లేదా? అన్నది కాస్త వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం డేనియల్ క్రెయిగ్ కథానాయకుడిగా జేమ్స్ బాండ్ 25 సెట్స్ పై ఉంది. బాండ్ సినిమా అంటే ఎంతో కొంత పార్ట్ ఇండియాలోనూ చిత్రీకరిస్తారు. స్టార్ వార్స్ కి ఇండియా నేటివిటీ కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి క్రేజీ చిత్రాల్లో నటించాలని ఆశపడిన ఈ బోల్డ్ బ్యూటీ కల నెరవేరుతుందా లేదా చూడాలి! అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
Please Read Disclaimer