రక్తచరిత్ర గాళ్ ఛీప్ ట్రిక్స్

0

నిరంతర వివాదాలతో వేడెక్కించడం ఆ అందాల నటికి కొత్తేమీ కాదు. వివాదాస్పద కథాంశాల్లో నటించడం అన్నా.. వేడెక్కించే కంటెంట్ తో విరుచుకుపడడం అన్నా తనకు ఎంతో ఆసక్తి. అందుకే బోల్డ్ అండ్ కాంట్రవర్శీ క్వీన్ అంటూ ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ఇంతకీ ఎవరీ అమ్మడు అంటే పరిచయం అవసరం లేదు. రక్త చరిత్ర ఫేం రాధిక ఆప్టే గురించే ఇదంతా.

పరిటాల రవి జీవితకథతో తెరకెక్కించిన రక్తచరిత్రలో పరిటాల భార్య సునీత పాత్రలో నటించిన రాధిక ఆప్టే తన పాత్రకు ప్రాణం పోసింది. అటుపై బాలకృష్ణ సరసన లెజెండ్ లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఓ హీరోపై ఊహించని నింద వేసి.. పరిశ్రమకు దూరమైంది. అటుపై బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో తెచ్చుకున్న పాపులారిటీ తెలిసిందే.

బాలీవుడ్ లో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటున్న ఆప్టే సోషల్ మీడియాలోనూ నిరంతరం ఫోటోషూట్లతోనూ టచ్ లో ఉంటోంది. ఇటీవలే ప్రఖ్యాత వోగ్ కవర్ షూట్ లో పాల్గొన్న ఆప్టే ఫోటోలు గత కొంతకాలంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలోని ఓ ఛమ్కీ ఫోటో సైడ్ స్ట్రిప్ లుక్ తో వేడెక్కిస్తోంది. ఒకరకంగా ఆప్టే గాళ్ బోల్డ్ యాటిట్యూడ్ కి ఇది నిదర్శనం. పోటీ ప్రపంచంలో నిరంతరం లైమ్ లైట్ లో ఉండాలంటే ఇలాంటివి తప్పనిసరి. అందుకే ఈ అమ్మడు ఇలాంటి ట్రిక్స్ ఎన్నో ప్లే చేస్తుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Please Read Disclaimer