ఆప్టే మ్యాడమ్ కిరాక్ ఫోజులే

0

రంగుల ప్రపంచంలో తనని తాను ఆవిష్కరించుకునేందుకు రాధిక ఆప్టే ఎంచుకున్న మార్గం తెలిసిందే. ఓవైపు వివాదాలు.. మరోవైపు ఎదురే లేని ప్రతిభ ఈ అమ్మడిని ఠఫ్ కాంపిటీషన్ లోనూ నిలబెట్టాయి. ఎందరు స్టార్ హీరోయిన్లు ఉన్నా తనకంటూ ఒక రూట్ ఉందని ప్రూవ్ చేసారు ఆప్టే. ఎలాంటి భేషజానికి పోకుండా ఒంటిపై నూలుపోగైనా లేకుండా నటించేందుకు సిద్ధపడే ఈ అమ్మడు పర్ఫెక్ట్ కళాకారిణి అని నిరూపించుకున్నారు. సినిమా.. వెబ్ సిరీస్.. కంటెంట్ ఏదైనా గమ్మత్తైన ఎంపికతో దూసుకెళుతోంది.

ఆప్టే నటించిన `లస్ట్ స్టోరీస్` ఇంతకుముందు సంచలన విజయం సాధించింది. రాధిక నటన హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత మళ్లీ ఈ అమ్మడు నటించిన తాజా వెబ్ సిరీస్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ నెల 31 న `రాత్ అకేళి హై` ప్రీమియర్స్ కి నెట్ ఫ్లిక్స్ ఏర్పాట్లు చేస్తోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఓటీటీ సినిమా ఇది. నవాజుద్దీన్ సిద్ధిఖి లాంటి ఫేమస్ స్టార్ నటించడంతో ఆసక్తి నెలకొంది. హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రోనీ స్క్రూవాలా నిర్మించారు.

కుటుంబ సమేతంగా చూడదగ్గ మర్డర్ మిస్టరీ మూవీ అంటూ రాధిక ట్విట్టర్ లో తెగ ప్రచారం చేసేస్తోంది. పనిలో పనిగా కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. తాజాగా షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో రాధిక లుక్ ఇంట్రెస్టింగ్. సింపుల్ గా కనిపిస్తూనే షార్ప్ గా తన ఐడియాలజీని ప్రెజెంట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో జోరుగా వైరల్ అవుతోంది. 2019లో మూడు సినిమాల్లో నటించిన ఆప్టే 2020లో మాత్రం ఈ వెబ్ సినిమాతో సరిపెట్టుకుంది. మహమ్మారీ లాక్ డౌన్ తన ప్లానింగ్స్ ని ఇబ్బంది పెట్టిందనే భావించాలి.