రాధికా ని లండన్ వీధుల్లో కూడా గుర్తుపడుతున్నారట…

0

స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు తమిళం హిందీ బెంగాలీ మరాఠీ ఇంగ్లీష్ భాషల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మహరాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ ముందుగా స్టేజీ ఆర్టిస్ట్ గా నిరూపించుకుంది. ఈ క్రమంలో మరాఠీ హిందీ ఇంగ్లీషు భాషల్లో పలు ప్రయోగాత్మక నాటకాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాల మీద ఆసక్తితో లండన్ వెళ్లి డ్యాన్స్ నేర్చుకుని తిరిగొచ్చిన రాధికా ఆప్టే ముందుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. తన బోల్డ్ మాటలు.. ముక్కుసూటిగా మాట్లాడే తత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ బ్యూటీ తెలుగులోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘రక్తచరిత్ర 2’ ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వీటితో పాటు ‘బద్లాపూర్’ ‘హంటర్’ ‘ఫోబియా’ ‘సాక్రెడ్ గేమ్స్’ ‘అహల్య’ ‘ప్యాడ్ మ్యాన్’ ‘లస్ట్ స్టోరీస్’ వంటి సినిమాలు మరియు వెబ్ సిరీసెస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా కరోనా లాక్ డౌన్ లో రాధికా ఆప్టే లండన్ లో తన భర్తతో కలిసి ఉండిపోయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రాధికా తనకు సంభందించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో లాక్ డౌన్ విషయాలను వెల్లడించారు.

”కరోనా క్రైసిస్ వలన అందరూ ఇంట్లోనే ఉంటూ వెబ్ సిరీస్ మూవీస్ ఎక్కువగా చూస్తున్నారు. దీంతో ఇప్పుడు నన్ను లండన్ వీధుల్లో కూడా గుర్తు పడుతున్నారు. నా కోసం లండన్ వీధుల్లో ప్రజలు ఎప్పుడు బయటకు వస్తానా అని ఎదురుచూస్తున్నారు. నేను లండన్ లో ఈ రకమైన అనుభవాన్ని ఎప్పుడూ పొందలేదు” అని రాధికా చెప్పుకొచ్చింది. కొంతమంది నా దగ్గరకు వచ్చి మీ యాక్టింగ్ చాలా బాగుంటుందని చెబుతున్నారని.. కాకపోతే వారు నా స్క్రీన్ నేమ్ తో పిలుస్తుండటం నాకు నచ్చలేదు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో తన జీవితంలో జరిగిన మార్పులను కూడా వెల్లడించింది. మునుపెన్నడూ లేని విధంగా తన ఇంటిని తనే స్వయంగా క్లీన్ చేసుకుంటూ నీట్ గా ఉంచుతున్నానని చెప్పింది. ఇప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం.. వ్యాయామం చేయడం.. మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటివి ప్రయారిటీగా మారాయని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.
Please Read Disclaimer