ఆయన్ను పెళ్లి చేసుకోవడం నా తలరాత…రాధిక

0

కన్నడతో పాటు సౌత్ లోని ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అలరించిన రాధిక కొన్నాళ్ల క్రితం హెచ్ డీ కుమారస్వామిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో నిర్మాతగా వ్యవహరించిన కుమారస్వామితో రాధిక పరిచయం ప్రేమగా మారి వివాహంకు దారి తీసింది. అంతకు ముందే కుమారస్వామికి వివాహం అవ్వడంతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. రెండవ పెళ్లి చేసుకున్న కుమారస్వామి విషయంలో అప్పట్లో ప్రకంపనలు చెలరేగాయి. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే రాధిక ఆయన్ను వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత సినిమాలకు స్వస్థి చెప్పింది.

కుమారస్వామిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బిడ్డకు తల్లి అయిన రాధిక ఇటీవల మళ్లీ వెండి తెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. కుమారస్వామి సీఎం అయిన తర్వాత ఈమె వరుసగా సినిమాల్లో నటించింది. ఇక వీరిద్దరి మద్య విభేదాలని.. ఇద్దరు విడిపోయారంటూ రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. పెళ్లికి ముందు సినీ నటిని పెళ్లి తర్వాత రాజకీయ నాయకుడి భార్యను అని పిలుస్తున్నారు. రాజకీయ నేతను పెళ్లి చేసుకోవడం నా తలరాత. ఆయన్ను పెళ్లి చేసుకోవడం పట్ల నేను ఎప్పుడు కూడా తప్పు చేసిన ఫీలింగ్ కలగలేదు.

నా తలరాత ఎలా ఉంటే అలాగే నా జీవితం సాగుతుందని నేను నమ్ముతాను. మేమిద్దరం విడిపోయినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదు. మేమిద్దం చాలా సంతోషంగానే ఉన్నాం. దేవుడు రాసిన తలరాత మాదిరిగా మా వైవాహిక జీవితం సాఫీగానే సాగుతోంది. నేను ఎప్పుడు కూడా తప్పు చేశానని బాధ పడలేదు. జీవితంలో మనం అనుకున్నామని ఏది జరుగదు.

నా భర్త పేరును ఇంటర్వ్యూల్లో కాని ఇతర వేదికలపై అయినా కాని చెప్పేందుకు నేను ఇష్టపడను. ఎందుకంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం భార్యలు భర్తల పేర్లు చెబితే ఆయుష్షు తగ్గుతుందని నేను నమ్ముతున్నాను అంది. ప్రస్తుతం రాజకీయంగా కుమార స్వామి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వంకు కష్టాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో ఈమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం విశేషం.
Please Read Disclaimer