వ్యాయామంతో మతులు పోగొడుతున్న రాధికా మదన్!

0

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ రాధికా మదన్. రీసెంట్ గా రిలీజైన అంగ్రేజీ మీడియం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో తన నటనతో సెలెబ్రిటీల నుండే కాదు విమర్శకుల నుండి కూడా ప్రశంసలను అందుకుంది. తొలుత కొన్ని సీరియళ్లలో నటించిన ఈ భామ 2018లో విడుదలైన ‘పటాకా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఢిల్లీ నుండి తెరమీదకి వచ్చిన ఈమె తన అందం అభినయంతో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. రాధికా ఢిల్లీలో పేరు ప్రఖ్యాతలు గల సంపన్న కుటుంబం నుండి వచ్చింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉన్నత విద్య పూర్తీ చేసుకొని బ్యూటీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి డిగ్రీ పట్టా పొందింది. ఆ తర్వాత టెలివిజన్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సీరియళ్ల ద్వారా అవార్డులు రివార్డులు రావడంతో సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

తన మొదటి రెండు సినిమాలు రాధికకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ప్రస్తుతం రాధిక వ్యాయామం చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో అమ్మడు కేవలం చేతుల ఆధారంతో కాళ్లను పైకి పెట్టి నవ్వుతూ కెమారాకు పోజ్ ఇచ్చింది. ఆ పోజ్ చూసి నెటిజన్లు మనసు పారేసుకుంటున్నారు. తాజాగా అమ్మడు ఇన్స్టాగ్రామ్లో ‘ఈ రోజుల్లో నేలపై పడకండి’ అంటూ.. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన పాట నుంచి ఆ లైన్ తీసుకుందట. అయితే శీర్షాసనం వేయడం మాత్రం అంత సులభం కాదు. ఈ ఆసనం వేస్తే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరికినట్లే. ఈ ఆసనం రోగనిరోధక శక్తితో పాటు ఏకాగ్రతను దృష్టిని మెరుగుపరుస్తుందని చెప్తుంది అమ్మడు. రాధిక పోజులు చూస్తూ కుర్రకారు మతులు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం రాధిక సోషల్ మీడియాలో తెగ ఆదరణ పొందుతోంది.
Please Read Disclaimer