లారెన్స్ మాస్టార్ హర్ట్.. కఠిన నిర్ణయం!

0

రాఘవ లారెన్స్ మాస్టార్ హర్టయ్యారా? ఉన్నట్టుండి ఏమైంది? ఆయన ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? .. ప్రస్తుతం అభిమానుల్లో సందేహం ఇది. అసలింతకీ లారెన్స్ తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి? అంటే.. ఇకపై ఏ పబ్లిక్ ఫంక్షన్ కి తాను అతిధిగా హాజరు కాబోనని లారెన్స్ సడెన్ డెసిషన్ తీసుకోవడం సంచలనమైంది.

“రజనీకాంత్ సర్ సినిమా కార్యక్రమాల కు తప్ప ఇక ఏ వేడుకకు ఎటెండ్ కాను. అది కూడా రజనీ సర్ అనుమతి తీసుకున్నాకే ఆ కార్యక్రమానికి వస్తాను. వేరొక పబ్లిక్ ఈవెంట్ కి రాలేను. ఈ నిర్ణయాని కి రకరకాల కారణాలు ఉన్నాయి. అవన్నీ మీతో చెప్ప లేను. నాకు రజనీ దీవెనల కంటే ఇంకేదీ ముఖ్యం కాదు“ అంటూ సామాజిక మాధ్యమాల్లో కాస్త ఎమోషనల్ పోస్ట్ చేయడం తో ఫ్యాన్స్ లో రకరకాల సందిగ్ధతలకు కారణమైంది.

ఇటీవల `దర్బార్` ఈవెంట్లో మాట్లాడుతూ “రజనీ కాంత్ అభిమాని ని అవ్వడం వల్ల కమల్ హాసన్ సినిమా పోస్టర్ల పై పేడ చల్లానని.. అదంతా అభిమానం తో అపరిపక్వం గా చేసిన పని“ అని వ్యాఖ్యానించారు లారెన్స్. అటుపై కమల్ హాసన్ డైహార్డ్ ఫ్యాన్స్ సీరియస్ అవ్వడమే గాక లారెన్స్ పై సోషల్ మీడియా లో వ్యతిరేక ప్రచారం సాగించారు. ట్రోల్స్ తో విరుచుకు పడ్డారు. ఆ క్రమంలోనే కమల్ హాసన్ ని కలిసి మరీ లారెన్స్ సారీ చెప్పారు. తాను ఏ పరిస్థితి లో అలా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత కమల్ హాసన్ అభిమానుల కు లారెన్స్ వివరణ ఇచ్చారు. ఇప్పటికీ కమల్ ఫ్యాన్స్ సీరియస్ గా ఉండడం తో మరోసారి ఇలాంటి కఠిన నిర్ణయాన్ని ప్రకటించారన్నమాట.
Please Read Disclaimer