లారెన్స్ 3డి సూపర్ హీరో మూవీ!

0

సౌత్ లో ఇప్పటివరకూ సూపర్ హీరో సినిమా ఏదీ రాలేదు. రజనీ- శంకర్ కాంబినేషన్ లో రోబో- 2.0 సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు. అయితే బాలీవుడ్ లో తెరకెక్కించిన క్రిష్ సిరీస్ .. ధూమ్ సిరీస్ తరహా సినిమాలు సౌత్ లో లేవనే చెప్పాలి. దక్షిణాదిన ఆ తరహా తొలి అవకాశం లారెన్స్ మాస్టార్ కి దక్కిందనేది కోలీవుడ్ మీడియాలో ప్రచారం సాగుతోంది. లారెన్స్ త్వరలోనే ఓ సూపర్ హీరో మూవీకి దర్శకత్వం వహించబోతున్నారని ఈ చిత్రానికి సన్ పిక్చర్స్ భారీ పెట్టుబడుల్ని సమకూర్చనుందని చెబుతున్నారు.

సౌత్ లో ప్రభుదేవా తర్వాత ప్రామిస్సింగ్ డైరెక్టర్ గా లారెన్స్ మాస్టార్ కి గుర్తింపు ఉంది. కొరియోగ్రాఫర్ గా అతడి కెరీర్ కి చిరంజీవి.. రజనీకాంత్ .. నాగార్జున లాంటి హీరోలు బూస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటుడిగా దర్శకుడిగా లారెన్స్ సత్తా చాటుతున్నాడు. తెలుగు-తమిళ్ లో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన లారెన్స్ కాంచన(ముని) సిరీస్ సక్సెస్ తో జాతీయ స్థాయిలో పాపులరయ్యాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా `కాంచన` రీమేక్ `లక్ష్మీ బాంబ్` తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే లారెన్స్ తెరకెక్కించే తదుపరి సినిమా గురించి ఆసక్తికర ప్రచారం మొదలైంది.

`లక్ష్మీ బాంబ్` తర్వాత లారెన్స్ ఓ సూపర్ హీరో మూవీకి దర్శకత్వం వహించనున్నారు. ఇది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కే 3డి సినిమా. 3డి సహా వీఎఫ్ ఎక్స్ కోసం సన్ పిక్చర్స్ భారీగా పెట్టుబడులు పెడుతోంది అంటూ ప్రచారం సాగుతోంది. సౌత్ లో అన్ని భాషల్లో రిలీజయ్యే ఈ చిత్రానికి 70-100 కోట్ల మేర బడ్జెట్ వెచ్చిస్తారన్న ముచ్చటా సాగుతోంది. లారెన్స్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఆఫర్ ఇదేనన్న టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer