దర్శకేంద్రుడిలో ఇంకా ఆ యాంగిల్ ఉందే

0

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలు అనగానే అప్పట్లో హీరోయిన్స్ అందాలే గుర్తుకు వచ్చాయి. వందకు పైగా సినిమాలు తెరకెక్కించిన రాఘవేంద్ర రావు ఎంతో మంది హీరోయిన్స్ ను పరిచయం చేశాడు. మరెంతో మంది హీరోయిన్స్ ను స్టార్స్ ను చేశాడు. హీరోయిన్స్ పై ఎక్కువ ఫోకస్ పెట్టే రాఘవేంద్ర రావు ఇప్పటికి కూడా ఇంకా హీరోయిన్స్ పై ఫోకస్ పెడుతున్నట్లుగా ఆయన మాటలు వింటుంటే అనిపిస్తుంది. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్నా కూడా ఆయన హీరోయిన్స్ పై వేసే పంచ్ లు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా రాఘవేంద్ర రావు ‘జాను’ చిత్రం సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు. సమంత.. శర్వానంద్ లు లీడ్ రోల్ లో నటించిన జాను చిత్రంను చూసిన ఈ చిత్రాన్ని గీతాంజలి చిత్రంతో దర్శకేంద్రుడు పోల్చాడు. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిని అభినందించిన రాఘవేంద్రరావు ముఖ్యంగా సమంతపై ప్రశంసలు కురిపించారు. జాను పాత్రకు ప్రాణం పోసినట్లుగా నటించావు అంటూ అభినందించాడు.

ఇదే సమయంలో జాను చిత్రంలో సమంత వేసుకున్న కుర్తా మరియు ప్యాంట్ ను వర్షంలో తడిచి విడిచినప్పుడు శర్వానంద్ ఆరబెడుతాడు. ఆ డ్రస్ ను అడగాలనిపించింది. కాని నేను రామచంద్రను కాదు కదా రాఘవేంద్రరావును కదా అనే విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయాను అన్నాడు. ఆ మాటలకు అక్కడున్న వారు అంతా గట్టిగా నవ్వేశారు. సమంత ముసి ముసిగా నవ్వుతు తెగ సిగ్గుపడిపోయింది. మొత్తానికి రాఘవేంద్రరావు గారిలో ఇంకా ఆ యాంగిల్ అలాగే ఉందన్నమాట అంటూ నెటిజన్స్ మీమ్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer