నాగశౌర్యను సర్ ప్రైజ్ చేసిన వెటరన్ డైరెక్టర్

0

యువ హీరో నాగ శౌర్య కాలికి ఈమధ్య ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. నాగశౌర్య సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో భాగంగా వైజాగ్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో నాగ శౌర్య కాలికి గాయం అయింది. దీంతో డాక్టర్లు నాగ శౌర్యను రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. నాగశౌర్య రికవర్ అయ్యేవరకూ షూటింగును కూడా వాయిదా వేయడం జరిగింది.

ప్రస్తుతం నాగశౌర్య హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. శౌర్య త్వరగా కోలుకోవాలని అభిమానులు.. శ్రేయోభిలాషులు ఇప్పటికే కోరుకుంటున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాలను తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ యువహీరోకు దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు గారు సర్ ప్రైజ్ ఇచ్చారు. నాగశౌర్య నివాసానికి వెళ్ళిన రాఘవేంద్రరావు శౌర్యతో కాసేపు గడిపారట. కాలి ఫ్రాక్చర్ గురించి వివరాలు తెలుసుకున్న ఆయన శౌర్యను త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారట.

సీనియర్ దర్శకుడైన రాఘవేంద్రరావు ఇలా తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు రావడంతో శౌర్య క్లీన్ బౌల్డ్ అయ్యాడట. ప్రస్తుతం శౌర్యతో రాఘవేంద్రరావు గారు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతా బాగుంది గానీ గురువుగారు శౌర్యకు బత్తాయిలు నారింజలు తీసుకెళ్ళారో లేదో.. ఆ ఫోటోలో ట్రేలు.. ప్లేట్లు.. గ్లాసులు కనిపిస్తున్నాయి కానీ పండ్ల జాడ లేనే లేదు!