51ఏళ్ల రీల్ విలన్.. 33 ఏళ్ల మోడల్ తో డేటింగ్

0

తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని రీల్ విలన్ రాహుల్ దేవ్. పలు తెలుగు సినిమాల్లో విలనీ పాత్రలు పోషించిన ఇతడి పేరు తెలీకున్నా.. చూసినంతనే గుర్తుకు వచ్చే ఇతడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తెలుగు అగ్రహీరోల సినిమాల్లో ప్రతినాయకుడి పాత్ర పోషించిన రాహుల్ దేవ్ వ్యక్తిగత జీవితం పెద్ద చర్చగా మారింది. 1998లో రాహుల్ వివాహం జరిగినా.. పదకొండేళ్ల క్రితం క్యాన్సర్ తో ఆమె మరణించారు. వారికో కొడుకు ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో రాహుల్ దేవ్ మోడల్ కమ్ నటి అయిన ముగ్దా గాడ్సేను ప్రేమిస్తూ డేటింగ్ చేస్తున్న వైనం సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ అందరిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈ జంట మధ్య వయసు తేడా ఏకంగా 18 సంవత్సరాలు. ప్రస్తుతం రాహుల్ వయసు 51 ఏళ్లు కాగా.. ముగ్దా వయసు 33 ఏళ్లు మాత్రమే. దీంతో.. ఇంత వయసు తేడా పెట్టుకొని డేటింగా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయితే.. తమ ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా పెద్ద విషయం కాదంటున్నాడు రాహుల్ దేశ్. తన భార్య చనిపోయిన చానాళ్లకు ఒక పెళ్లి లో ముగ్దను చూశానని.. తొలుత ఫ్రెండ్స్ అయ్యామని.. తర్వాత ఇద్దరి మధ్య ఇష్టం పుట్టిందన్నారు. తమ ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలుసని.. తన కొడుక్కి ఇష్టమేనని చెప్పుకొచ్చాడు. ఈ రీల్ విలన్ రియల్ స్టోరీ ఇప్పుడు సంచలనంగా మారింది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-