అక్కినేని మల్టీస్టారర్ షాకిచ్చే నిజం

0

అక్కినేని మల్టీస్టారర్ `మనం` ఎంత పెద్ద సక్సెసైందో తెలిసిందే. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఈ సినిమా తెలుగు సినిమా హిస్టరీలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఏఎన్నార్ నటించిన చిట్టచివరి చిత్రమిది. దర్శకుడు విక్రమ్.కె.కుమార్ కి గొప్ప పేరు గుర్తింపు తెచ్చింది ఈ చిత్రం. ఆ తర్వాత మనం సీక్వెల్ వస్తుందని ప్రచారమైనా ఇప్పటివరకూ దాని జాడే లేదు. అయితే ఈలోగానే అక్కినేని మల్టీస్టారర్ కి `మన్మధుడు2` దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారమవుతోంది.

నాగచైతన్య- అఖిల్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ ని ప్లాన్ చేయమని రాహుల్ రవీంద్రన్ కి నాగార్జున ఆఫర్ ఇచ్చారని `మన్మధుడు 2` రిలీజవ్వగానే అతడు ఆ పనిలో బిజీగా ఉంటాడని ప్రచారమైంది. అయితే ఇది నిజమా? అన్న ప్రశ్నకు రాహుల్ రవీంద్రన్ నుంచి ఆన్సర్ వచ్చింది. ఓకింత విస్మయానికి గురవుతూ అతడు ఇచ్చిన జవాబు అందరికీ షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి.

“ఈ ప్రచారమంతా ఆధారం లేనిది. కేవలం రూమర్ మాత్రమే. అది ఎలా వ్యాపించిందో అస్సలు అర్థం కావడం లేదు“ అని రాహుల్ రవీంద్రన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మన్మధుడు 2 రిలీజయ్యేవరకూ వేరొక ప్రాజెక్టు గురించిన ఆలోచనేదీ చేయలేదని తెలిపారు. మన్మధుడు 2 రిలీజ్ తర్వాత తదుపరి ప్రాజెక్టు గురించి ఆలోచిస్తానని రాహుల్ అన్నారు. దీనిని బట్టి.. అక్కినేని మల్టీస్టారర్ పై జరిగినది అంతా కేవలం అసత్యప్రచారం అని అర్థమవుతోంది. మన్మధుడు 2 ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer